Aadhi Pinisetty | ‘వైశాలి’ లేకుంటే ‘శబ్దం’ సినిమా ఉండేది కాదు : ఆది పినిశెట్టి
Aadhi Pinisetty | ఆది పినిశెట్టి, కోలీవుడ్ దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘శబ్దం'(Sabdham)
Sabdham Movie | నటుడు ఆది పినిశెట్టి, కోలీవుడ్ దర్శకుడు అరివళగన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘శబ్దం'(Sabdham). 15 ఏండ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఈరం(తెలుగులో ‘వైశాలి’) తర్వాల మళ్లీ ఈ ముగ్గురి కాంబోలో ‘శబ్దం’ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో లక్ష్మీమీనన్ కథనాయికగా నటిస్తుండగా.. 7G ఫిల్మ్స్ సివా & ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై అరివళగన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించగా.. ఈ వేడుకకు నాని ముఖ్య అతిథిగా వచ్చి చిత్రబృందానికి సినిమా విజయవంతం అవ్వాలని శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే ఈ మూవీ ఈవెంట్లో ఆది మాట్లాడుతూ.. వైశాలి లేకుంటే శబ్దం సినిమా ఉండేది కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శబ్దం సినిమా ప్రయాణం 16 ఏండ్ల క్రితం స్టార్ట్ అయ్యింది. ‘వైశాలి’ అనే సినిమా వలన ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. వైశాలి లేకుంటే ఈరోజు శబ్దం సినిమా కూడా ఉండేది కాదు. ఈ విషయంలో మా దర్శకుడిగా ధన్యవాదాలు తెలపాలి. వైశాలి ఇప్పుడు చూసిన కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఈ సినిమాకి కథనే బలం అంత నిజాయితీతో తీశాం. ఇప్పుడు అంతే నిజాయితీతో శబ్దం సినిమా తెరకెక్కించాం. నా కెరీర్లో ఈ చిత్రం చాలా స్పెషల్‌గా నిలిచిపోతుందంటూ ఆది చెప్పుకోచ్చాడు.
శబ్దం సినిమా కథ విషయానికి వస్తే.. హారర్ – థ్రిల్లర్‌గా రాబోతుంది. ఇందులో శబ్దాలు (సౌండ్) కథలో కీలక పాత్ర పోషించనుండగా.. ఆది పినిశెట్టి ఇందులో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడు శబ్దాలకు అతీంద్రియ శక్తులతో ఉన్న సంబంధం ఏంటి అనే రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇందులో కథానాయికగా నటిస్తున్న లక్ష్మీ మీనన్ పాత్ర ఒక వింతైన శబ్దాల అనుభవంతో బాధపడుతూ, ఆ రహస్యానికి కేంద్ర బిందువుగా ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

