ఓ దర్శకుడి ప్రేమాయణం

‘వరుసగా ఆరు హిట్లు కొట్టిన దర్శకుడతను. అలేఖ్య అనే డాక్టర్ ప్రేమలో పడతాడు. ఆమెకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. వీరిద్దరివి భిన్న మనస్తత్వాలు అయినప్పటికీ ప్రేమలో పడతారు. చివరకు తన ప్రేయసితోనే ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని రూపొందించేందుకు ఆ దర్శకుడు ప్రయత్నిస్తాడు. వీరిద్దరి ప్రేమాయణం ఎలా సాగిందన్నదే మా చిత్ర కథ’ అన్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆయన దర్శకత్వంలో సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. బెంచ్‌మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు, డాక్టర్ మధ్య ప్రేమాయణాన్ని ఆవిష్కరిస్తూ టీజర్ అందంగా సాగింది. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: వివేక్‌సాగర్, ఆర్ట్: సాహిసురేష్, సమర్పణ: గాజులపల్లి సుధీర్‌బాబు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

