Aa Ammayi Gurinchi Meeku Cheppali | సుధీర్‌బాబు కొత్త చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..!
Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date | ఫలితంతో సంబంధంలేకుండా కొత్తదనంతో కూడిన కథాంశాలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు. గతంలో రొటీన్ సినిమాలను చేసుకుంటూ వచ్చిన సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమాతో తన రూట్ మార్చుకున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ చిత్రం తర్వాత సుధీర్ కథల ఎంపిక పూర్తిగా మారింది. ‘వి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి వినూత్న కథలను ఎంచుకుంటున్నాడు. కమర్షియల్‌గా ఈ రెండు చిత్రాలు అంతగా సక్సెస్ కాకపోయినా సుధీర్‌కు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈయన మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే లవ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు.
ఈ సినిమా విడుదల తేదీని బుధవారం 11.07 నిమిషాలకు వెల్లడించనున్నట్లు ప్రకటించారు. మొదటి నుండి ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా సుధీర్‌బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో తెరకెక్కుతున్న మూడో చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. రాహుల్ రామకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నాడు. బెంచ్‌మార్క్ స్టూడీయోస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
The wait is almost over!! Announcing the release date of #AaAmmayiGurinchiMeekuCheppali tomorrow 😊@IamKrithiShetty #MohanaKrishnaIndraganti @oddphysce @MythriOfficial @saregamasouth @benchmarkstudi5 pic.twitter.com/pD0SrrPOSz
— Sudheer Babu (@isudheerbabu) August 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

