Malaika Arora | షారుఖ్ నటించిన ‘దిల్సే’ మూవీలోని ‘ఛయ్య.. ఛయ్యా..’, సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’ చిత్రంలోని ‘మున్నీ బద్నామ్..’ వంటి పాపులర్ ప్రత్యేక గీతాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది బాలీవుడ్ నటి మలైకా అరోరా. గత మూడేళ్ల నుంచి తెరపై ఆమె కనిపించలేదు. ప్రస్తుతం ఓ రియాలిటీ షోతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
‘మూవింగ్ ఇన్ విత్ మలైకా’ పేరుతో వస్తున్న ఈ షో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 5న ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ముంబయి బాంద్రాలోని మలైకా ఇంటికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కిచెన్, లివింగ్ రూమ్, బెడ్రూమ్, ఎంట్రెన్స్.. ఇలా అన్నీ రిచ్ లుక్‌లో దర్శనమిచ్చాయి. ఈ చిత్రాలు ప్రస్తుతం నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.