A.R.Murugadoss | సెట్స్ పైకి ఊహించని కాంబో.. ఏ.ఆర్ మురుగదాస్‌కు తమిళ స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్?
A.R.Murugadoss Next Movie | తమిళ దర్శకుల్లో మణిరత్నం, శంకర్ల తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉంది ఏ.ఆర్ మురుగదాస్‌కే. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు కానీ.. అప్పట్లో ఈయన నుంచి సినిమా వస్తుందంటే హీరో ఎవరా? అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లేవారట.
A.R.Murugadoss Next Movie | తమిళ దర్శకుల్లో మణిరత్నం, శంకర్ల తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉంది ఏ.ఆర్ మురుగదాస్‌కే. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు కానీ.. అప్పట్లో ఈయన నుంచి సినిమా వస్తుందంటే హీరో ఎవరా? అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లేవారట. ఓ వైపు సోషల్ మెసేజ్ ఇస్తూనే.. మరోవైపు కమర్షియల్ హంగులు బాగా దట్టించి బ్లాక్బస్టర్లు కొట్టడం ఆయన ప్రత్యేకత. తమిళంకు సమానంగా తెలుగులోనూ ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా మెగా అభిమానులకు స్టాలిన్ రూపంలో మర్చిపోలేని సినిమా ఇచ్చాడు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఇప్పటికి టాలీవుడ్ బెస్ట్ ఇంట్రో సీన్లలో స్టాలిన్ ఇంట్రోను ఒకటిగా చెప్పుకుంటుంటారు. అయితే అదే మురుగదాస్ మహేష్ అభిమానులకు కూడా పీడకలలాంటి సినిమా ఇచ్చాడు. అదే స్పైడర్.
ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో సాంబార్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించడంతో తెలుగు అభిమానులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. స్పైడర్ తర్వాత మురుగదాస్ నుంచి ఆహా ఓహో అనిపించే సినిమా ఒక్కటి కూడా రాలేదు. సర్కార్, దర్బార్ సినిమాలనైతే ఒక్కసారి చూడటం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఇక దర్బార్ తర్వాత ఇప్పటివరకు మురుగదాస్ నుంచి మరో సినిమా రాలేదు. మధ్యలో గజనీ సీక్వెల్ అంటూ ప్రచారం జరిగినా.. అది కుదురలేదు. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు తన కొత్త సినిమాను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.
శివ కార్తికేయన్‌తో త్వరలోనే ఓ పాన్ ఇండియా సినిమాను ప్రకటించబోతున్నట్లు తమిళ మీడియాల సమాచారం. పీరియాడిక్ డ్రామా సెటప్‌లో ఈ సినిమా థీమ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్‌కు తమిళంలో మంచి క్రేజ్‌తో పాటు మార్కెట్ కూడా ఉంది. సరిగ్గా ఆయన్ని వాడుకుంటే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటుంది. సరైన టైమ్ చూసి గ్రాండ్‌గా ఈ సినిమాను మురుగుదాస్ ప్రకటించబోతున్నట్లు టాక్. హీరోయిన్గా మృనాళ్ను తీసుకోనున్నారట. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ ఫిక్సయినట్లు వినికిడి. మరీ ఈ సినిమాతో అయినా.. మురుగుదాస్ కంబ్యాక్ ఇస్తాడో? లేదో? చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

