Director Sundar. C | తెరపై కొత్త ప్రపంచాన్ని చూస్తారంటున్న బాక్ దర్శకుడు సుందర్
‘ఈ కథ కోసం రీసెర్చ్ చేసే క్రమంలో చరిత్రతో ముడిపడిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలిసింది. అస్సామీ జానపదాల్లో ‘బాక్' అనే దెయ్యం ఉండేదట. ఆ దెయ్యానికి చెందిన కొన్ని విషయాలు నన్ను సర్ప్రైజ్ చేశాయి. అక్కడే ఈ కథకు బీజం పడింది.
Director Sundar. C | ‘ఈ కథ కోసం రీసెర్చ్ చేసే క్రమంలో చరిత్రతో ముడిపడిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలిసింది. అస్సామీ జానపదాల్లో ‘బాక్’ అనే దెయ్యం ఉండేదట. ఆ దెయ్యానికి చెందిన కొన్ని విషయాలు నన్ను సర్ప్రైజ్ చేశాయి. అక్కడే ఈ కథకు బీజం పడింది. అస్సామీ, బ్రహ్మపుత్ర ప్రాంతంలో ఉండే ‘బాక్’ అనే దెయ్యం మన ప్రాంతానికి వస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనే ఆలోచనతో ఈ కథ రాశాను. ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించే సినిమా ఇది’ అని సుందర్.సి అన్నారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘బాక్’. ‘అరణ్మనై’ సిరీస్‌లో ఇది నాలుగో సినిమా. తమన్నా భాటియా, రాశీఖన్నా కథానాయికలు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్‌కుమార్ నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సుందర్.సి విలేకరులతో ముచ్చటించారు.
‘అరణ్మనై’ సీరీస్‌లో వచ్చిన మూడు సినిమాలూ పగ, ప్రతీకార నేపథ్యంలో ఉంటే, ఇది వాటికి భిన్నంగా ఉంటుంది. ఒక అద్భుతమైన ఎలిమెంట్ ఈ కథలో భాగంగా ఉంటుంది. విజువల్స్, మ్యూజిక్, లొకేషన్స్ అన్నీ డిఫరెంట్‌గా అనిపిస్తాయి. గత మూడు చిత్రాల మాదిరిగానే ఇందులో కూడా స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి. ఇందులో కొత్త తమన్నాను చూస్తారు. రాశీఖన్నా పాత్ర కూడా విభిన్నంగా ఉంటుంది’ అని తెలిపారు సుందర్.సి. సవాలుగా తీసుకొని చేసిన సినిమా ఇదని, ఇందులో సీజీ వర్క్ అదిరిపోతుందని, విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఆయన చెప్పారు. సురేశ్, ఏషియన్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం ఆనందంగా ఉందని, హిందీలోనూ సినిమాను విడుదల చేస్తున్నామని, ప్రేక్షకాదరణ లభిస్తే ‘అరణ్మనై 5’ కూడా ఉంటుందని సుందర్.సి అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

