గర్ల్ ఫ్రెండ్‌గా నేషనల్ క్రష్
ఇన్నాళ్లూ హీరోలతో జతకట్టి ఆడిపాడిన రష్మిక.. ఇప్పుడు సినిమా అంతా తానే అయ్యి, సినిమాను భుజాలపై మోయడానికి రెడీ అయ్యింది. ఆమె ప్రధానపాత్రధారిగా ‘ ది గర్ల్ ఫ్రెండ్' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది.
ఇన్నాళ్లూ హీరోలతో జతకట్టి ఆడిపాడిన రష్మిక.. ఇప్పుడు సినిమా అంతా తానే అయ్యి, సినిమాను భుజాలపై మోయడానికి రెడీ అయ్యింది. ఆమె ప్రధానపాత్రధారిగా ‘ ది గర్ల్ ఫ్రెండ్’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. దర్శక, నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ లతో కలిసి ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది.
విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, దర్శకుడు మారుతి కెమెరా స్విచాన్ చేశారు. ‘బేబీ’ దర్శకుడు సాయిరాజేశ్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.
వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ చిత్రానికి కెమెరా: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

