ట్రాన్స్‌జెండర్స్ జీవితాలను, సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా ‘ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్’. ఎల్బీ శ్రీరామ్, ఎస్తర్, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి, ప్రీతీ నిగమ్‌లతో పాటు రియల్ ట్రాన్స్‌జెండర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో సుభాష్ చక్రవర్తి రవడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది.
ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్‌జెండర్స్‌కి అండగా నిలుస్తున్న పలు సేవా సంస్థల నిర్వాహకులను చిత్రబృందం సత్కరించింది. ట్రాన్స్‌జెండర్స్ విషయంలో ఉన్న వివక్ష తొలగిపోవాలని, సమాజంలో వారికీ సమగౌరవం లభించాలని తెలిపే సినిమా ఇదని దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి చెప్పారు.