రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మాయలేడీ’. ప్రశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగే లవ్‌స్టోరీ ఇదని, కథానాయిక పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని, యాక్షన్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ తెలిపారు.
గ్లింప్స్ చివరలో ‘ఇప్పుడు నా లవ్‌స్టోరీలో విలన్ ఎవరో తెలుస్తున్నది’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ కథపై ఆసక్తినిరేకెత్తిస్తున్నది. మధుమిత, సర్కార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, నిర్మాణ సంస్థ: క్రేజీయాంట్స్ ప్రొడక్షన్స్, రచన-దర్శకత్వం: ప్రశంకర్.