అలియాభట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ స్పైథ్రిల్లర్ ‘ఆల్ఫా’ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. యశ్‌రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రానుంది. ఇందులో అలియాభట్ గూఢచారి పాత్రలో కనిపించనుంది. దేశానికి వ్యతిరేకంగా ‘ఆల్ఫా’ పేరుతో ప్రతినాయకుడు నడిపే మిషన్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా అలియాభట్ బృందం చేసిన సాహసాలు ఏమిటన్నదే ఈ సినిమా ఇతివృత్తం.
హై ఇంటెన్సిటీ యాక్షన్‌తో ట్రైలర్ ఆద్యంతం థ్రిల్‌ని పంచింది. బాబీడియోల్ క్రూరుడైన విలన్ పాత్రలో కనిపించాడు. ‘సీత లంకాదహనం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా’ అంటూ అలియాభట్ చెప్పిన డైలాగ్ ట్రైలర్లో హైలైట్‌గా నిలిచింది. ఆదిత్యచోప్రా నిర్మాణంలో శివ్ రవాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకురానుంది.