e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News 83: గూస్ బంప్స్ తెప్పిస్తున్న 83 మూవీ ట్రైల‌ర్

83: గూస్ బంప్స్ తెప్పిస్తున్న 83 మూవీ ట్రైల‌ర్

బాలీవుడ్‌లో ఎన్నో బ‌యోపిక్స్ రూపొంది మంచి విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. తాజాగా క‌పిల్ దేవ్ జీవిత నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతుంది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ‘83’ పేరుతో తెర‌కెక్కుతున్న చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్‌ రాజ్‌ భాసీన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకొనె, కబీర్‌ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్‌ నడియాడ్‌వాలా, ఫాంటమ్‌ ఫిలిమ్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్‌ లిమిటెడ్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని కొన్ని స‌న్నివేశాలు రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి. లండన్‌ లార్డ్‌ క్రికెట్‌ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ పూర్తిగా ట్రాన్స్‌ఫాం అయ్యాడు. అద్భుత‌మైన షాట్స్‌తో ఇండియాకి విజ‌యాన్ని అందించాడు క‌పిల్. ఆ స‌న్నివేశాల‌ను అద్భుతంగా చూపించారు.

- Advertisement -

అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. ఈ సినిమాలో క‌పిల్ డేర్ డెవిల్స్ ప్ర‌స్థానం ఎలా సాగింది? వారికి ఎదురైన స‌వాళ్లు ఏంటి? అనే విష‌యాల‌ను 83 సినిమాలో ఆవిష్కరించారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement