అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిత్రాలలో కపిల్ దేవ్ బయోపిక్ ఒకటి. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో ‘83’ పేరుతో చిత్రం తెరకెక్కగా, ఇందులో రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకొనె, కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నాడు కలిప్‌దేవ్. భారత్‌కు తొలిసారి వరల్డ్ కప్ అందించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కపిల్‌దేవ్ తర్వాత వచ్చిన ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. ఇలా టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టిన కపిల్‌దేవ్ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు ఈ బయోపిక్‌ని రూపొందిస్తుండగా, కొద్ది సేపటి క్రితం టీజర్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో కపిల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. 1983 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ దృశ్యాలని టీజర్ లో చూపించారు. ఈ టీజర్ లో రణ్వీర్ సింగ్ మెరుపు కాలం మాత్రమే కనిపించారు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు విప్ రిచర్డ్స్ ని అవుట్ చేయడంతో మ్యాచ్ ఇండియా వైపు తిరిగింది. మదన్ లాల్ బౌలింగ్ లో రిచర్డ్స్ 33 పరుగుల వద్ద బంతిని గాల్లోకి కొడతారు. దీనితో కపిల్ దేవ్ వెనక్కి పరిగెడుతూ అత్యంత కష్టమైన క్యాచ్ ని అద్భుతంగా అందుకుంటాడు.
ఫైనల్ మ్యాచ్ లో అదే కీలక మలుపు. టీజర్ లో ఆ దృశ్యాల్ని చూపించారు. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ క్యాచ్ అందుకుంటుండగా 83 అనే టైటిల్ పడుతుంది. టీజర్ లో విజువల్స్ బావున్నాయి. క్రికెట్ ప్రియులకి ఇది గూస్బంప్స్ తెప్పిస్తుంది. మీరు టీజర్ చూసి ఎంజాయ్ చేయండి. ట్రైలర్ నవంబర్ 30న విడుదల కానుంది.