Muttiah Muralitharan biopic | మురళీధరన్ జీవితం స్ఫూర్తిదాయకం
టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్‌స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘800’. ఎం.ఎస్.శ్రీపతి దర్శకుడు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు.
టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్‌స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘800’. ఎం.ఎస్.శ్రీపతి దర్శకుడు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం ముంబయిలో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘1993లో నేను తొలిసారి మురళీధరన్‌ను కలిశాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతున్నది. మురళీధరన్ ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితాన్ని గడుపు తుంటాడు. కెరీర్లో ఎన్నో అవరోధాలను అధిగమించి ఆయన విజేతగా నిలిచాడు. పిచ్ ఎలా ఉన్నా బంతిని టర్న్ చేసే ప్రతిభ మురళీధరన్ సొంతం. అతన్ని ఎలా ఎదుర్కోవాలో అని మేము మీటింగ్స్‌లో డిస్కస్ చేసేవాళ్లం’ అన్నారు. క్రికెట్ చరిత్రలోనే సచిన్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని, ట్రైలర్ ఆవిష్కరణకు ఆయన అతిథిగా రావడం గౌరవంగా భావిస్తున్నానని ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్ర సమర్పకులు శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

