7/G Brundavan Colony | సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ‘7/జీ బృందావన్ కాలనీ’ (2004) చిత్రం నాటి యువతను ఎంతగానో ఆకట్టుకుంది. హృ ద్యమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల మన్ననలందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌కు రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకుడు సెల్వరాఘవన్.
గత ఏడాది ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా సీక్వెల్ సన్నాహాల్లో ఉన్నామని చిత్ర నిర్మాత ఏ.ఎం. రత్నం తెలిపారు. అందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. రవికృష్ణ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని దర్శకుడు సెల్వరాఘవన్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.