7/G Brindavan Colony | 7/జి బృందావన కాలనీ రీ-రిలీజ్.. ట్రెండింగ్‌లో కాజల్ అగర్వాల్
7/G Brindavan Colony | దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో లెక్కలేనన్ని ప్రేమకథల కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో బరువును మిగిల్చాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకొనేది 7/G బృందావన్ కాలనీ. రవికృష్ణ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం కోలీవుడ్ కంటే తెలుగులో భారీ హిట్ కొట్టింది.
7/G Brindavan Colony | దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో లెక్కలేనన్ని ప్రేమకథల కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో బరువును మిగిల్చాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకొనేది 7/G బృందావన్ కాలనీ. రవికృష్ణ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం కోలీవుడ్ కంటే తెలుగులో భారీ హిట్ కొట్టింది. ఇక సినిమా వచ్చి పంతొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే స్క్రీన్కు అతుక్కుపోతుంటాం. అంతలా చెదరిపోని జ్ఞాపకాలు మిగిల్చింది. అయితే అలాంటి కల్ట్ సినిమా శుక్రవారం రోజు రీ-రిలీజ్ అయ్యింది.
ఇక మొదటి రోజే ఈ సినిమా ఏకంగా రూ. కోటికి పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా మంచి బుకింగ్స్‌తో నడుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక విషయం బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో మేం వయసుకు వచ్చాం (Mem Vayasuku Vachcham) పాట ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ పాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) జూనియర్ ఆర్టిస్టుగా డ్యాన్స్ చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై నెటిజెన్లు స్పందిస్తూ.. ఆమె కాజల్ అని కొందరు అంటుండగా.. మరి కొందరు కాజల్ ఆలా ఉండదు అంటున్నారు. కాగా దీనిపై కాజల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
#KajalAggarwal in #7GBrundavanColony ? pic.twitter.com/hOFOkHweZz
— Movies4u Official (@Movies4u_Officl) September 23, 2023
#KajalAggarwal in #7GBrundavanColony4K 😍😍#7GBrindavanColony pic.twitter.com/aSeRBk0XFg
— Australian Telugu Films (@SrTelugu) September 23, 2023
Kajal Agarwal in #7GBrundavanColony pic.twitter.com/h8r6sDcNMx
— SiD (@wakeupsiduu) September 23, 2023
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. సెల్వ రాఘవన్ ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో మునిగిపోయాడని చెన్నై టాక్. అయితే సీక్వెల్లో హీరోయిన్ ఎవరా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక తొలి పార్టుకు తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోసిన యువన్ శంకర్ రాజానే సెకండ్ పార్టుకు కూడా సంగీతం వహించబోతున్నట్లు టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

