Natti kumar | కొత్తవారు బాగుండాలి!

‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 32 ఏళ్లు అయ్యింది. సుదీర్ఘ ప్రయాణంలో చిన్న సినిమాల్ని బతికించడానికి నిరంతరం పోరాడుతూనే ఉన్నా’ అని అన్నారు నట్టికుమార్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నట్టికుమార్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ ఏడాది పుట్టినరోజు నాకు ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. ‘డీఎస్‌జే’ సినిమా ద్వారా హీరోయిన్గా నా కూతురు కరుణ, ‘సైకోవర్మ’తో హీరోగా తనయుడు క్రాంతి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. నటన పట్ల మక్కువతోనే వారు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. దాదాపు ఇరవై ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది నేను మళ్లీ దర్శకత్వబాధ్యతల్ని స్వీకరించాను. పదిమంది బాగుండాలన్నదే నా సిద్ధాంతం. దానిని నమ్మే సమాజం, ఇండస్ట్రీలోని సమస్యలపై పోరాడుతున్నా. సినిమాల పట్ల ప్రేమతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న కొత్తవారు బాగుండాలన్నదే నా ఆశయం. నా కూతురు నట్టి కరుణ ప్రధాన పాత్రలో ‘కశ్మీర్ మనదేరా’ పేరుతో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నా. 370 ఆర్టికల్ నేపథ్యంలో మహిళల హక్కుల ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. రాజశేఖర్‌తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నా’ అనితెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Birthday
- dsj
- natti kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

