Mega 158 | మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం Mega158 పూజా కార్యక్రమాలతో గురువారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, 30 ఏళ్ల క్రితం నాటి ఒక మధురమైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, తనకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే.. 30 సంవత్సరాల క్రితం “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా సమయంలో ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అంత టైమ్ తీసుకుని వచ్చి, తన 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు థాంక్యూ చెబుతూ ‘లవ్ యూ కళ్యాణ్’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
సరిగ్గా 1996లో పవన్ కళ్యాణ్ డెబ్యూ ఫిల్మ్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రారంభోత్సవంలో తమ్ముడి సినిమాకు అన్నగా చిరంజీవి క్లాప్ కొట్టగా, ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ అవుతూ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి అన్నయ్య సినిమాకు క్లాప్ కొట్టడం మెగా అభిమానులకు కనులవిందుగా మారింది. ఈ పూజా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌తో పాటు నాగబాబు కూడా హాజరవడంతో మెగా త్రయం ఒకే వేదికపై సందడి చేసింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సంస్థకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఎస్. థామన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచే హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే…
30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది – “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో
టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి… pic.twitter.com/HGBENbRtlp— Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2026