100 కోట్లకు తగ్గేదేలే

అగ్ర హీరో అల్లు అర్జున్ ‘పుష్ప’ బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మూవీ హిందీలో ఆరో వారం ప్రదర్శితమవుతున్నది. ఆరు వారాల్లో దాదాపు 97 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తున్నది. హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్, హిందీ మూవీ 83లను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర నిలబడింది ‘పుష్ప’. ఆరోవారంలో 6 కోట్ల రూపాయలు రాబట్టింది. ఏడోవారం ఎంట్రీతో 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్ లో ఇంత భారీ వసూళ్లు సాధించడం, అదీ ఓటీటీలో విడుదల అయ్యాక కూడా కొనసాగడం అరుదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. వచ్చే వారం ‘బదాయి దో’ అనే సినిమా రిలీజ్ అవుతున్నది. ఆ టైమ్‌కు ‘పుష్ప’ ఫుల్ రన్ టైమ్ పూర్తి అవుతుంది. ఆ లోగా 105 కోట్ల రూపాయలతో ‘పుష్ప’ బాలీవుడ్ జైత్రయాత్ర ముగియనుంది. ‘పుష్ప’ పాటలకు అంతర్జాతీయ క్రికెటర్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో డాన్సులు చేయడం ఈ మధ్య వైరల్ గా మారింది. ఈ ప్రచారం కూడా సినిమా వసూళ్లు పెరగడానికి కారణమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రెండు భాగాల సినిమాగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా మొదటి భాగం గతేడాది డిసెంబర్ 17న విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఆశ్చర్యపరిచే వసూళ్లు సాధించింది ‘పుష్ప’.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- cinima
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

