సీతారాముల ప్రేమాయణం

సాయిరోనక్, నేహాసోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్శేఖర్ రేపల్లే దర్శకుడు. ఉదయ్‌కిరణ్ నిర్మించారు. ఈ నెల 19న విడుదలకానున్నది. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. దర్శకత్వశాఖలో పదిహేనేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సురేష్శేఖర్ కమర్షియల్ హంగులతో అర్థవంతంగా సినిమాను తెరకెక్కించాడు’ అని తెలిపారు. ‘ఇందులో రామ్ అనే మధ్యతరగతి యువకుడిగా నేను కనిపిస్తా. నా క్యారెక్టర్‌తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సీత అనే అమ్మాయి కోసం రాముడు ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది’ హీరో సాయిరోనక్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘స్టార్స్ లేని చిన్న సినిమా మాది. కానీ క్వాలిటీ పరంగా ఆ భావన ఎక్కడా కలగదు. షూటింగ్ సమయంలో గాయపడినా లెక్కచేయకుండా తన పాత్రకు న్యాయం చేసింది నేహా. సాయిరోనక్ పాత్ర కొత్తగా ఉంటుంది’ అని తెలిపారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్‌తో పాటు అన్ని వాణిజ్య హంగులున్న సినిమా ఇదని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో గేయరచయితలు సురేష్ గంగుల, దేవ్, నటులు కల్యాణ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈసీఐఎల్ రూ.133.74 కోట్ల డివిడెండ్
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

