‘రెండున్నరేళ్ల కష్టానికి ప్రతిరూపమిది. లక్ష్యసాధన కోసం హీరో సాగించే ప్రయాణం సరికొత్తగా ఉంటుంది. కథ డిమాండ్ చేయడంతో సినిమాలో ఎయిట్ప్యాక్ లుక్‌లో కనిపించా’ అని అన్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్రామ్మోహన్రావు, శరత్‌మరార్ నిర్మిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో వెంకటేష్ విడుదలచేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ‘దర్శకుడు సంతోష్ కథ చెప్పిన విధానం నచ్చి సినిమా అంగీకరించా. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్లతో పోటీపడి నటించడం చాలెంజింగ్‌గా అనిపించింది. రెగ్యులర్ స్పోర్ట్స్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘తెలుగులో క్రీడానేపథ్య సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీచేసే సినిమా ఇది’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మరుగున పడుతున్న విలువిద్య క్రీడా ఔన్నత్యాన్ని చాటిచెప్పే చిత్రమిది. పార్ధు పాత్రకు నాగశౌర్య ప్రాణప్రతిష్ట చేశాడు. ఎయిట్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాడు. హీరోకు అండగా నిలిచే యువతిగా కేతిక కనిపిస్తుంది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలభైరవ, కేతికశర్మ తదితరులు పాల్గొన్నారు.