క్రిష్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రావణలంక’. అస్మితకౌర్ భక్షి నాయిక. బిఎన్ఎస్ రాజు దర్శకుడు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను నూతన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఆద్యంతం ఆసక్తికరంగా మాస్, క్లాస్ ఆడియన్స్ని అలరించే అంశాలతో రూపొందించిన చిత్రమిది. ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అన్నారు. మురళీశర్మ, రచ్చరవి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉజ్జల కుమార్ సాహా.