పాయల్ కొత్త కళ

కరోనా వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో తమకు లభించిన విరామాన్ని ఇష్టమైన వ్యాపకాలతో సద్వినియోగం చేసుకుంటున్నారు సినీ తారలు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో సాయపడుతూ సామాజిక బాధ్యతను చాటుకుంటూనే మరోవైపు మనసుకు నచ్చిన పనులతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విరామంలో పంజాబీ సొగసరి పాయల్ రాజ్‌పుత్ తనలోని కొత్త కళను పరిచయం చేసింది. చిత్రకారిణిగా మారిన ఆమె ఓ అందమైన కాన్వాస్ పెయింటింగ్ వేసింది. పచ్చిక బయళ్లను, నీలాకాశాన్ని వర్ణరంజితంగా చిత్రించిన పాయల్ ఆ పెయింటింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘చిత్రలేఖనంతో పరిచయం ఉన్నా ఇదివరకెప్పుడూ కాన్వాస్ పెయింటింగ్స్ వేయలేదు. ఇదే నా తొలి ప్రయత్నం. పికాసోలా నన్ను నేను ఊహించుకుంటూ ఈ పెయింటింగ్ వేశాను’ అని పాయల్ తెలిపింది. ఈ పెయింటింగ్‌ను ఉద్దేశిస్తూ చిత్రలేఖనంలో పాయల్‌రాజ్‌పుత్ ప్రావీణ్యం అద్భుతమంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగులో వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె ఇటీవలే పంజాబీలో ఓ సినిమాను అంగీకరించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

