క్యాప్షన్ అవసరం లేదు!

పవన్‌కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రానికి ‘భీమ్లానాయక్’ అనే పేరుని ఖరారు చేశారు. నిత్యామీనన్, ఐశ్వర్యరాజేష్ కథానాయికలు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ ఇది. సాగర్ కె చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌గ్లింప్స్‌ను దర్శకుడు హరీష్‌శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదలచేశారు. ఓ అభిమానిగా పవన్‌కల్యాణ్ నుంచి ఆశించే అంశాలన్నీ ఫస్ట్గ్లింప్స్లో కనిపించాయని, సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని హరీష్‌శంకర్ తెలిపారు. ఈ వీడియోలో ‘అరేయ్ డానీ బయటకు రా….’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ఎంట్రీ ఇచ్చారు పవన్‌కల్యాణ్. ‘డేని..డేనియల్ రాజశేఖర్’ అంటూ రానా తన పేరును చెప్పగానే..‘భీమ్లా.. భీమ్లా నాయక్..ఏంటి చూస్తున్నామ్..కింద క్యాప్షన్ లేదనా..అక్కర్లేదు బండెక్కు’ అంటూ చివరగా పవన్‌కల్యాణ్ చెప్పిన డైలాగ్ అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉంది. ‘ప్రధాన తారాగణం పాల్గొనగా హైదారాబాద్‌లో కీలక సన్నివేశాలు, పోరాటఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది. సెప్టెంబర్ 2న తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నాం. వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. రావు రమేష్, మురళీశర్మ, సముద్రఖని, రఘుబాబు, నర్రాశ్రీను, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, సంగీతం: తమన్, ఎడిటర్: నవీన్నూలి, సంభాషణలు, స్క్రీన్‌ప్లే: త్రివిక్రమ్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, దర్శకత్వం: సాగర్ కె చంద్ర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

