Reliance on Z Merger | రిలయన్స్‌లో జీ విలీనానికి చర్చలు.. ఇన్వెస్కో వల్లే వెనుకడుగు!
Reliance on Z Merger | తమ సంస్థలో విలీనానికి జీ ఎంటర్టైన్మెంట్కు ఫెయిర్ ఆఫర్ ఇచ్చామని రిలయన్స్ బుధవారం వెల్లడించింది.

Reliance on Z Merger | సోనీలో విలీనంపై జీ ఎంటర్టైన్మెంట్ బుధవారం కొత్త మలుపు తిరిగింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జీ ఎంటర్టైన్మెంట్.. దాని అనుబంధ సంస్థలను విలీనం చేసుకునేందుకు చర్చలు జరిపినట్లు రిలయన్స్ తెలిపింది. అయితే జీ ఎంటర్టైన్మెంట్కు, అందులో అతిపెద్ద వాటాదారు, అమెరికాకు చెందిన ఇన్వెస్కో మధ్య విభేదాల వల్లే చర్చలు కొనసాగలేదని తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్వెస్కోకు 18 శాతం వాటా ఉంది. జీ సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా పనితీరుపై ఇన్వెస్కో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది. కార్పొరేట్ గవర్నెన్స్ పాటించని పునీత్ గోయెంకాను తప్పించాలని, మొత్తం బోర్డును పునర్వ్యవస్థీకరించాలని ఇన్వెస్కో డిమాండ్ చేస్తున్నది.

జీ విలీనానికి ఫెయిర్ ప్రతిపాదన.. రిలయన్స్
కాగా మంగళవారం జీ ఎంటర్టైన్మెంట్ ఓ ప్రకటన చేస్తూ అంతకుముందు దేశంలోని అతిపెద్ద సంస్థతో విలీన ఒప్పందం కుదుర్చుకోవాలని ఇన్వెస్కో తమపై ఒత్తిడి తీసుకొస్తున్నదని ఆరోపించింది. ఈ ఆరోపణను ఇన్వెస్కో గట్టిగానే తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో జీ విలీనానికి చాలా పారదర్శక ప్రతిపాదన తీసుకొచ్చామని రిలయెన్స్ తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్కు ఫెయిర్ ఆఫర్ ఇచ్చామని వెల్లడించింది. రిలయన్స్‌కు ఇప్పటికే నెట్వర్క్ 18 మీడియా, టీవీ 18 బ్రాడ్కాస్ట్ అనే మీడియా సంస్థలు ఉన్నాయి.

విలీనంతో జీ సామర్థ్యాలు బలోపేతం
తమ సంస్థలో విలీనం వల్ల జీ శక్తి సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని. జీ వాటాదారులతో సహా అందరికి గణనీయ విలువ సృష్టించడానికి వీలవుతుందని రిలయన్స్ తెలిపింది. రిలయన్స్‌లో విలీనమైన తర్వాత కూడా జీ ఎండీగా పునీత్ గోయెంకాను కొనసాగించే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది. వివిధ సంస్థల మేనేజ్మెంట్ల పనితీరుకు గుర్తుగా వాటిని కొనసాగించడానికే తాము మొగ్గు చూపేవారం అని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
ఐఫోన్13కు చిప్‌ల కొరత.. యాపిల్ షేర్లు పతనం
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. ఇక పాలు కూడా పితకలేరేమో..
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
రూ 15 లక్షల లోపు రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

