Xiaomi SU7 EV | త్వరలో భారత్ మార్కెట్లోకి షియోమీ సెడాన్ ఎస్యూ7 ఈవీ.. గేమ్ చేంజర్ అవుతుందా..?!
Xiaomi SU7 EV Car | చైనా టెక్ దిగ్గజం.. త్వరలో భారత్ మార్కెట్లోకి తన సెడాన్ మోడల్ కారు ఎస్యూ7ను తీసుకు రానున్నది.
Xiaomi SU7 EV Car | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పెట్రోల్, డీజిల్ వినియోగ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన కార్ల తయారీ సంస్థలతోపాటు చైనా టెక్నాలజీ దిగ్గజం షియోమీ (Xiaomi) పోటీ పడుతోంది. ఇప్పటి వరకూ స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్లు, టాబ్లెట్లు, టీవీలు ఆవిష్కరించిన షియోమీ.. తాజాగా భారత్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారు తీసుకొస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో షియోమీ తీసుకొస్తున్న సెడాన్ ఎలక్ట్రిక్ కారుకు ‘ఎస్యూ7’ అనే పేరు పెట్టింది. ఇప్పటికే చైనా మార్కెట్లోకి ఎంటరైన ‘ఎస్యూ7’ కారు.. అన్ని కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చింది. ఈ కారు ధర 2,15,900 చైనా యువాన్లు.. భారత్ కరెన్సీలో సుమారు రూ.25 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. భారత్ మార్కెట్లోకి ఎంటరై 10 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా షియోమీ తన ఎస్యూ 7 ఈవీ కారును బెంగళూరులో ప్రదర్శించింది.
సింగిల్ చార్జింగ్ తో 668 కి.మీ నుంచి 800 కి.మీ దూరం ప్రయాణించే సామర్థ్యం షియోమీ ఎస్యూ 7 సొంతం. లగ్జరీ ఫీచర్లతో వస్తున్న ఈ కారు భారతీయుల్ని మరింతగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. కేవలం మూడు నిమిషాల్లో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుందీ కారు. గరిష్టంగా గంటకు 265 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. షియోమీ పైలట్ అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ క్యాబిన్ విత్ 16.1 అంగుళాల 3కే ఆల్ట్రా క్లియర్ సెంట్రల్ కంట్రోల్ స్క్రీన్ ఉంటాయి. ఈ కారు విద్యుత్ మోటారు గరిష్టంగా 673 పీఎస్ విద్యుత్, 838 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

