Xiaomi 14 Civi | డ్యుయల్ సెల్ఫీ కెమెరాలతో షియోమీ 14 సివి ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Xiaomi 14 Civi | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన షియోమీ 14 సివి (Xiaomi 14 Civi) ఫోన్‌ను బుధవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Xiaomi 14 Civi | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన షియోమీ 14 సివి (Xiaomi 14 Civi) ఫోన్‌ను బుధవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 మొబైల్ ప్లాట్ ఫామ్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. షియోమీ 14 సిరీస్ ఫోన్లలో వినియోగించిన లైకా బ్రాండెడ్ 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది. చైనా మార్కెట్లో ఇంతకుముందే ఆవిష్కరించిన షియోమీ సివి 4 ప్రో ఫోన్ ను రీబ్రాండ్ చేసి.. షియోమీ 14 సివిగా భారత్ మార్కెట్లో ఆవిష్కరించారని తెలుస్తున్నది.
షియోమీ 14 సివి ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.42,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.47,999లకు లభిస్తాయి. క్రూయిజ్ బ్లూ, మచ్చా గ్రీన్, షాడో బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఫన్ సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోం స్టోర్స్, షియోమీ రిటైల్ పార్టనర్స్ వద్ద ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి షియోమీ 14 సివి ఫోన్ లభిస్తుందని పేర్కొంది.
బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఫోన్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేసే వారికి రూ.3000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. షియోమీ 14 సివి ఫోన్ల కొనుగోలుదారులకు మూడు నెలల యూ-ట్యూబ్ సబ్స్క్రిప్షన్, ఆరు నెలల పాటు గూగుల్ వన్ 100 జీబీ డేటా లభిస్తుంది.
షియోమీ 14 సివి ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ మీద పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 1.కే కర్వ్డ్ 6.55 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటది. ఈ స్క్రీన్ హెచ్డీఆర్10+, డోల్బీ విజన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. రద్దీ ప్రదేశాల్లో డౌన్ లోడింగ్ స్పీడ్, నెట్ వర్క్ కవరేజీ కోసం టీ1 సిగ్నల్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ చిప్, సంప్రదాయ వాపౌర్ కూలింగ్ సిస్టమ్స్ కంటే మూడు రెట్లు ఎక్కువగా పని చేసే ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ వస్తుంది.
షియోమీ 14, షియోమీ 14 సివి ఫోన్లలో సమ్మిలక్స్ లెన్స్‌తోపాటు లైకా కో ఇంజినీర్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తోపాటు 50-మెగా పిక్సెల్ లైట్ ఫ్యుజర్ 800 ఇమేజ్ సెన్సర్ అండ్ 25ఎంఎం ఈక్వలెంట్ ఫోకల్ లెంథ్, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 2ఎక్స్ జూమ్, 12 -మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ కెమెరా విత్ 120- డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం రెండు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
షియోమీ 14 సివి ఫోన్ 5జీ, వై-ఫై 6, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బైదూ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్ సెన్సర్లు ఉంటాయి. డోల్బీ ఆట్మోస్ మద్దతుతో స్టీరియో స్పీకర్లు ఉంటాయి. అథంటికేషన్, సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ బ్యాక్డ్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్‌కు మద్దతుగా ఉంటుంది. 67వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. ఈ బ్యాటరీ 30 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

