బిట్‌కాయిన్ ఢమాల్

- 41వేల డాలర్ల దిగువకు విలువ
- గరిష్ఠ స్థాయి నుంచి 40% పతనం
లండన్, జనవరి 7: ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బిట్‌కాయిన్ విలువ.. నేలచూపులు చూస్తున్నది. క్రిప్టోకరెన్సీల్లో రారాజుగా వెలుగొందుతున్న బిట్‌కాయిన్ వైభవం.. గడిచిన రెండు నెలలుగా మసకబారిపోయింది. మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగుతుండటంతో ప్రస్తుతం 41వేల డాలర్ల దిగువకు పడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 5 శాతం క్షీణించింది. ఈ క్రమంలోనే నిరుడు సెప్టెంబర్ 29 నుంచి ఎన్నడూలేనంత కనిష్ఠ స్థాయి 40,938 డాలర్లను తాకింది. నిజానికి గతేడాది నవంబర్‌లో రికార్డు స్థాయిలో ఒక్క బిట్‌కాయిన్ 69,000 డాలర్లు (రూ.51.24 లక్షలు) పలికింది. దీంతో పరిగణిస్తే ప్రస్తుతం విలువ 40 శాతానికిపైగా పతనమైనైట్టెంది.
ఎందుకీ అలజడి?
ఒక్క బిట్‌కాయినే కాదు.. ఇతర అన్ని క్రిప్టోకరెన్సీలూ ఇప్పుడు నష్టాల్లోనే పయనిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే వడ్డీరేట్ల పెంపు బాట పట్టనుందన్న అంచనాలు, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు.. క్రిప్టోకరెన్సీల కొంప ముంచుతున్నాయి. క్రిప్టోకరెన్సీ మైనింగ్ ఇండస్ట్రీ పరుగులు పెడుతున్న కజకిస్తాన్‌లో ద్రవ్యోల్బణ నిరసన జ్వాలలు ఎగిసి పడుతుండటం కూడా క్రిప్టో ట్రేడింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది. మార్కెట్‌క్యాప్‌లో బిట్‌కాయిన్ తర్వాతి స్థానంలో ఉన్న ఈథర్ కూడా 8.6 శాతం క్షీణించి నిరుడు అక్టోబర్ 1 కనిష్ఠ స్థాయి 3,114 డాలర్లకు పరిమితమైంది. మరికొన్ని క్రిప్టోల విలువ కూడా 10 శాతం మేర దిగజారింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

