WhatsApp | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్..! త్వరలో సాధారణ కాలింగ్ ఆప్షన్..!
WhatsApp | ఇన్స్టంట్ మెజేసింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు మెరుగైన ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నది. ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు పని చేస్తున్నది.
WhatsApp | ఇన్స్టంట్ మెజేసింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు మెరుగైన ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నది. ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు పని చేస్తున్నది. యూజర్ల కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా వాట్సాప్ యాప్ సాధారణ కాలింగ్ ఆప్షన్ అందించేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే ‘ఇన్ యాప్ డయలర్ ఫీచర్’ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ వాట్సప్‌లోనే ఉండి, సాధారణ కాల్స్ చేసుకునే వీలుంటుంది. కాలింగ్ కోసం యాప్ నుంచి ఎగ్జిట్ అవసరం ఉండదు. నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్డేటెడ్ బీటా వెర్షన్ ఉన్నది. ఈ విషయాన్ని వాట్సాప్ ట్రాకర్ వాబీటా ఇన్ఫో(WABetaInfo) తెలిపింది. యూజర్లు యాప్ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. కాల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. యూజర్లు కాంటాక్ట్ బుక్‌ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం సైతం లేదని చెప్పింది. యాప్‌లో కుడివైపున దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కనిపిస్తుంది. దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాబీటా ఇన్ఫో వివరించింది. కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్ కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని.. త్వరలోనే అందుబాటులోకి తీసువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

