Passive Income | పనిచేయకుండానే డబ్బులు రావాలని ఆశపడుతున్నారా? మీ కోరిక తీరాలంటే ఇలా చేసి చూడండి!
Passive Income | ఆర్థిక పరిభాషలో పాసివ్ ఇన్కమ్ అనే పదం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నది. ఈ తరహా సంపాదనతో కులాసాగా కాలం గడిపేయొచ్చన్న భావన చాలామందికి వచ్చేసింది. ఇంతకీ పాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి?అచ్చతెలుగులో చెప్పాలంటే నిష్క్రియా ఆదాయం.
Passive Income | ఆర్థిక పరిభాషలో పాసివ్ ఇన్కమ్ అనే పదం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నది. ఈ తరహా సంపాదనతో కులాసాగా కాలం గడిపేయొచ్చన్న భావన చాలామందికి వచ్చేసింది. ఇంతకీ పాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి?అచ్చతెలుగులో చెప్పాలంటే నిష్క్రియా ఆదాయం. అర్థమయ్యేలా చెప్పాలంటే.. పని చేయకుండా వచ్చే పైసలు అన్నమాట! ఇదేదో బాగానే ఉందే.. ఇక కాయకష్టం చేయాల్సిన అవసరం లేదని ఫిక్సయిపోకండి. అలా కాలు కదపకుండా కాసులు రాలాలంటే.. అంతకుముందు యాక్టివ్ ఇన్కమ్ గణనీయంగా సంపాదిస్తే గానీ, పాసివ్ సంపాదనను అనుభవించలేం.
చర్యకు ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ నియమం. బలం ప్రయోగిస్తేనే శక్తి ఉత్పన్నం అవుతుందని మరో భౌతికశాస్త్ర సూత్రం. అదే కెమిస్ట్రీకి వస్తే.. ఒక రసాయన చర్యలో క్రియా జనకాలు సమపాళ్లలో కలిసినప్పుడే నిర్దేశిత క్రియా జన్యాలు వస్తాయి. ఆర్థిక శాస్ర్తానికి వస్తే కష్టపడితేనే పైస పుడుతుంది. క్రియ ఉన్నప్పుడే ఫలితం వస్తుంది. కానీ, నవీన ఆర్థశాస్త్ర పండితులు నిష్క్రియా పరత్వాన్ని సైతం ఫైనాన్షియల్ ఫార్ములాగా అభివర్ణిస్తున్నారు. ఈజీ మనీ సూత్రాలన్నీ పాసివ్ ఇన్కమ్ నుంచి పుట్టుకొచ్చినవే! యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చు, ఇన్‌స్టాలో ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయిపోవచ్చు… అని చెబుతున్నారు. కానీ, యూట్యూబర్‌గా కింగ్ అనిపించుకోవాలంటే దాని వెనుక అహరహం శ్రమించాల్సి ఉంటుంది. ఎఫ్బీలో ఇన్ఫ్లూయెన్సర్గా కాసులు కొల్లగొట్టడం.. నార్మల్ పోస్టు పెట్టినంత ఈజీ కాదు. పాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్‌కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు… ఆరు లైకులకు మించి సాధించేదేం ఉండదని ఆనక తెలుస్తుంది.
ప్రణాళికాబద్ధంగా బతకడమే..
ఇంతకీ నిష్క్రియా ఆదాయం అంటే ఏమిటి? పని చేయకుండా ఉండటం మాత్రం కాదు! ప్రణాళికా బద్ధంగా పొదుపు చేసుకొని ఏ రందీ లేకుండా జీవితాన్ని వెళ్లదీయడం ఒక కళ! జీవితంలో ఒక్కొక్క ఖర్చు గురించి ఇంత మొత్తం ఆదాయాన్ని సిద్ధం చేసుకోవడమే పాసివ్ ఇన్కమ్. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ముందస్తుగా పొదుపు చేయడం అన్నమాట! అందరూ అలాగే చేస్తారుగా ఇందులో వింతేముంది అనుకోవచ్చు. ఇదీ అలాంటిదే. కానీ, ఇంకాస్త పకడ్బందీగా వ్యవహరించడమే ఇందులో ఉన్న పరమార్థం. ఉదాహరణకు ప్రతినెలా ఇంటర్నెట్ బిల్లు రూ.650 కట్టాల్సి ఉందనుకోండి. ఓ లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. దానిపై నెలకు రూ.650 వరకు వడ్డీ వస్తుంది కదా! అలా వచ్చే మిత్తీ సొత్తుతో ఇంటర్నెట్ బిల్లు కట్టేయాలి. అప్పుడు మీ లక్ష బ్యాంకులో పదిలంగా ఉంటుంది. వచ్చే ఇంట్రెస్ట్ మీద మీ అవసరం తీరిపోతుంది. మీ రెగ్యులర్ ఆదాయంపై ఇంటర్నెట్ బిల్లు భారం పడకుండా ఉంటుంది. ఇలా మూలధనం నుంచి గానీ, ఆస్తి ద్వారా గానీ అవసరాలకు తగ్గట్టుగా ఆదాయం సమకూర్చుకోవడమే పాసివ్ ఇన్కమ్. సంపాదన బలంగా ఉన్నప్పుడు ప్రత్యేక సందర్భాల కోసం డబ్బును పదిలపరచి, ఆయా సమయాల్లో వినియోగించుకునే సొత్తు కూడా ఈ కోవకే చెందుతుంది.
ముందస్తు అంచనాతో..
డబ్బు సంపాదించడం తేలికే! దానిని కాపాడుకోవడమే కష్టంతో కూడుకున్న పని. ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ముందుగానే అంచనా వేయగలగాలి. ఊహించని పరిణామాల సంగతి పక్కన పెడితే.. పిల్లల చదువు, పెండ్లిల్లు, సెటిల్మెంట్, రిటైర్మెంట్ ఇలాంటి విషయాల్లో పక్కా ప్రణాళికతో ఉండాలి. ఆదాయాన్ని పొదుపు, మదుపు చేయడం ద్వారా భారీ ఖర్చులు కూడా తేలికైపోతాయి. ఆదాయం ఘనంగా ఉన్నప్పుడు మూలధనాన్ని కదిలించకుండానే ఈ పనులన్నిటినీ చక్కబెట్టొచ్చు. పాసివ్ ఇన్కమ్ ప్రిన్సిపుల్ పదవీ విరమణ తర్వాత చక్కగా ఉపయోగమవుతుంది. నెలవారీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వచ్చేలా చేసుకుంటే… విశ్రాంత జీవితం ప్రశాంతంగా కొనసాగించొచ్చు. చిన్నచిన్న పనులకే మూలధనాన్ని కదిలిస్తూ ఉంటే.. భారీ అవసరం ఏర్పడినప్పుడు నిధుల కొరత రావచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని యాక్టివ్‌గా ఉన్నప్పుడే పావివ్ ఇన్కమ్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం తెలివిమంతుల పని!!
నెలవారీ రాబడి
రెండు ఇండ్లు ఉన్నాయనుకోండి. ఒకదాంట్లో మీరు ఉంటే.. రెండో ఇంటిని అద్దెకు ఇస్తే ఆస్తి ద్వారా నెలవారీ ఆదాయం సమకూరుతుంది. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే.. విలువ భారీగానే పెరుగుతుండొచ్చు. కానీ, దాన్నుంచి ప్రతినెలా రాబడి వచ్చే అవకాశం ఉండదు. ఆదాయాన్నిచ్చే స్థిరాస్తులు ఉదాహరణకు వ్యవసాయ క్షేత్రాలు, ఇండ్లు లాంటివి, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఇన్వెస్ట్మెంట్ల ద్వారా పక్కా ఆదాయం సమకూర్చుకోగలిగితే.. అంతకన్నా దిలాసా ఏముంటుంది చెప్పండి?
చెట్లకు డబ్బు కాయకపోవచ్చు.కానీ, డబ్బుకు డబ్బు కాస్తుంది.
-చైనీస్ నానుడి
నోటును ఖాళీగా నిద్రపోనివ్వొద్దు. అది కష్టపడితేనే మనకు సుఖం.
-జపనీస్ పలుకుబడి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!


