వోల్వో ఎలక్ట్రిక్ మాడల్
దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో కార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి ఈవీను తీసుకొచ్చింది. ఈఎక్స్90 పేరుతో విడుదల చేసిన ఈ లగ్జరీ ఎస్యూవీ మాడల్ ప్రారంభ ధర రూ.1.26 కోట్లుగా నిర్ణయించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 12 : దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో కార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి ఈవీను తీసుకొచ్చింది. ఈఎక్స్90 పేరుతో విడుదల చేసిన ఈ లగ్జరీ ఎస్యూవీ మాడల్ ప్రారంభ ధర రూ.1.26 కోట్లుగా నిర్ణయించింది. ప్రస్తుతం బుకింగ్‌లు ఆరంభించిన ఈ మాడల్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది.
డిసెంబర్ 31లోపు బుకింగ్ చేసుకున్న వారికి 11 కిలోవాట్ల బాక్స్ చార్జర్, మూడేండ్లపాటు సర్వీసెస్ ప్యాకేజీని ఉచితంగా అందిస్తున్నట్టు ఈ సందర్భంగా కంపెనీ ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ఎన్విడియా డ్రైవ్ ప్లాట్‌ఫామ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8155 కాక్‌పిట్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ మాడల్‌లో గూగుల్ ఎకోసిస్టమ్‌తో నడిచే 14.5 ఇంచుల సెంట్రల్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, కేవలం 5.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 725 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని ఆయన చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

