వోక్స్వ్యాగన్లో 4000 మంది ఇంటికే?!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్పైనా బాగానే పడింది. త్వరలో 4,000 మంది ఉద్యోగులను ఉద్వాసన పలికేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సీనియర్ ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనివల్ల 598 మిలియన్ల డాలర్ల మేరకు వోక్స్ వ్యాగన్ ఆదా చేయగలుగుతుందని అంచనా.
వోక్స్ వ్యాగన్లో పని చేస్తున్న వారిలో 1964లో జన్మించిన వారికి పాక్షికంగా రిటైర్మెంట్ అమలు చేసేందుకు వర్క్ కౌన్సిల్తో తమ ప్రణాళికకు సంస్థ యాజమాన్యం ఆమోదం పొందిందని తెలుస్తున్నది. మిగతా ఉద్యోగుల్లో పాత వారిని ముందస్తుగా ఇంటికి పంపేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. మరో వైపు ఈ ఏడాది చివరి వరకు నూతన నియామకాలపై నిషేధం విధించింది వోక్స్ వ్యాగన్.
ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్కు బదులు పరిహారం చెల్లించడానికి 500 మిలియన్ల యూరోల నిధిని వోక్స్ వ్యాగన్ పక్కనబెట్టిందని వోక్స్ వ్యాగన్ వర్గాలు తెలిపాయి. తద్వారా దీర్ఘ కాలంలో బిలియన్ల డాలర్లు ఆదా చేయాలని సంస్థ సంకల్పించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాల్లో మాత్రమే నూతన నియామకాలకు అనుమతినిస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే రెండేండ్లలో ఓవర్హెడ్ ఖర్చులు ఐదు శాతం, ప్రొక్యూర్మెంట్ ఖర్చు ఏడు శాతానికి పైగా తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు గత జనవరిలోనే వోక్స్ వ్యాగన్ ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- jobs cut
- volkswagen
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

