వొడాఫోన్‌పై దెబ్బ మీద దెబ్బ.. బిర్లా లేఖ ఎంత పని చేసింది?!
వొడాఫోన్‌పై దెబ్బ మీద దెబ్బ..| కుమార మంగళం బిర్లా రాసిన లేఖ బయటపడటంతో వొడాఫోన్ ఐడియా మంగళవారం రూ.2,700 కోట్లు..

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా (వీఐఎల్)కు మంగళవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. వొడాఫోన్ ఐడియాలో తన వాటాను ప్రభుత్వం సూచించిన సంస్థకు అమ్మేందుకు సిద్ధమని వీఐఎల్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. ఈ సంగతి బయటపడటంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,700 కోట్ల మేరకు కోల్పోయింది.
12 శాతం నష్టపోయిన వొడాఫోన్ ఐడియా
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో వొడాఫోన్ ఐడియా స్క్రిప్ట్ 12 శాతం నష్టపోయి 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగియడానికి ముందు రికవరీ సాధించింది.
శరవేగంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా పయనిస్తుందన్న అంచనాల మధ్య బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఐ) సూచీ సెన్సెక్స్, అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఇండెక్స్ నిఫ్టీ లాభ పడి రికార్డులు నమోదు చేశాయి.
ఇదీ వొడాఫోన్ ఐడియా పరిస్థితి
కేంద్ర ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) రూ.50 వేల కోట్ల పై చిలుకు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం రూ.21,264 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉన్నది వొడాఫోన్ ఐడియా. మంగళవారం పతనంతో ఏజీఆర్ బకాయిలు రెట్టింపయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

