Vivo Y28s 5G | వివో వై28ఎస్ 5జీ ఫోన్‌పై ఆఫర్.. ఇవీ డిటెయిల్స్..!
Vivo Y28s 5G | గత జూలైలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన వివో వై28ఎస్ 5జీ ఫోన్‌పై వివో ఇండియా స్వల్పంగా ధర తగ్గించింది.
Vivo Y28s 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో గత జూలైలో వివో వై28ఈ 5జీ ఫోన్ తోపాటు వివో వై28ఎస్ 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ప్రస్తుతం మూడు ర్యామ్, మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్న ఫోన్ ధర స్వల్పంగా తగ్గించింది. వివో వై28ఎస్ 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ ఫోన్ రూ.13,999, 6జీబీ ర్యామ్ ఫోన్ రూ.15,499, 8 జీబీ ర్యామ్ ఫోన్ రూ.16,999లకు లాంచ్ చేసింది. తాజాగా రూ.500 ధర తగ్గింపుతో 4జీబీ ర్యామ్ ఫోన్ రూ.13,499, 6జీబీ ర్యామ్ ఫోన్ రూ.14,999, 8 జీబీ ర్యామ్ ఫోన్ 16,499లకే లభిస్తాయి. వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు లభిస్తాయి. ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.
వివో వై28ఎస్ 5జీ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 6.56 అంగుళాల హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తోందీ ఫోన్. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ ప్రైమరీ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 15వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ తోపాటు 5జీ, బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

