Vivo Y16- Vivo Y02T | ఆ రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో.. ఇవీ డిటైల్స్..!
Vivo Y16- Vivo Y02T | వివో తన బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లు వివో వై16, వివో వై02 టీ ఫోన్ల ధరలు తగ్గించి వేసింది. మంగళవారం నుంచి తగ్గించిన ధరలు అందుబాటులో ఉన్నాయి.
Vivo Y16- Vivo Y02T | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo).. తన వివో వై16 (Vivo Y16), వివో వై02 టీ (Vivo Y02T) ఫోన్లపై ధర తగ్గించింది. రెండు ఫోన్లపై మంగళవారం నుంచి ప్రారంభ ధర రూ.500 తగ్గిస్తున్నట్లు ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. వివో వై 16, వివో వై02 టీ ఫోన్లు రెండూ మీడియా టెక్ హెలియో పీ35 ఎస్వోసీ చిప్ సెట్, 10 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. వివో వై16 13-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్, వివో వై02 టీ ఫోన్ సింగిల్ 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో వస్తున్నాయి.
వివో వై 16 ఫోన్ బేస్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.10,499 (10,999), 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.11,999 (12,499)లకు లభిస్తాయి. ఇక వివో వై02 టీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.8,999 (9,499)లకు లభిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఆఫర్ చేస్తోంది వివో. వివో ఆన్ లైన్ స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వెబ్ సైట్లలో ఈ రెండు ఫోన్ల ధరలు లిస్టయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

