Russia-Ukraine War | రష్యాలో ఆపరేషన్స్ సస్పెండ్ చేసిన వీసా..మాస్టర్ కార్డ్
Russia-Ukraine War | ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగిన రష్యాలో వీసా, మాస్టర్ కార్డు తమ వ్యాపార లావాదేవీలను సస్పెండ్ చేశాయి.
Russia-Ukraine War | ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగిన రష్యాపై ఇంటర్నేషనల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్ సంస్థలు వీసా, మాస్టర్ కార్డ్ ఆంక్షలు విధించాయి. రష్యాలో తమ సంస్థల కార్యకలాపాలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇంతకుముందు రష్యాలో తమ కార్యకలాపాలను టెక్ జెయింట్స్ మైక్రోసాఫ్ట్, ఆపిల్ నిలిపేసిన సంగతి తెలిసిందే.
వీసా ఇంక్ చైర్మన్ కం సీఈవో ఆల్ కెల్లీ స్పందిస్తూ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగకున్నా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగిందని ఆరోపించారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. రష్యాలో కార్యకలాపాలను సస్పెండ్ చేయడం వల్ల తమ సహచర సిబ్బందికి, క్లయింట్లకు, పార్టనర్లు, మర్చంట్లకు, కార్డు హోల్డర్లకు తలెత్తే ఇబ్బందుల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. రష్యా చర్య శాంతి, సుస్థిరతకు ముప్పుగా పరిణమించిందన్నారు.
ఉద్యోగులు, వినియోగదారులు, ఇండస్ట్రీలోని వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత రష్యాలో కార్యకలాపాలు నిలిపేయాలని నిర్ణయించామని మాస్టర్ కార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ సేవలను కొనసాగించాలనే తాము భావించామని, కానీ ప్రస్తుత సంక్షోభంతో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకుల నేపథ్యంలో రష్యాలో నెట్వర్క్ సేవలు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

