Cyrus on Covishied exports Ban | కొవిషీల్డ్ ఎగుమతి నిషేధంపై పూనావాలా ఏమన్నారంటే?!
Cyrus on Covishied exports Ban | కరోనా మహమ్మారి నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతిపై ఎస్ఐఐ చైర్మన్ సైరస్ పూనావాలా ....

Cyrus on Covishied exports Ban | కరోనా మహమ్మారి నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతిపై సీరం ఇన్స్ట్యిటూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ సైరస్ పూనావాల సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం చాలా చెడు నిర్ణయం అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ తయారీ సంస్థగా సీరంను కేంద్రం నిర్ణయం ఇబ్బందుల్లోకి నెట్టేసిందని వ్యాఖ్యానించారు.

అదార్ నోరు మెదపొద్దన్నాడు..
శుక్రవారం ప్రతిష్ఠాత్మక లోక్మాన్య అవార్డు తీసుకున్న సైరస్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఎగుమతిపై మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం చాలా చెడు నిర్ణయం అన్నారు. తన కొడుకు, సంస్థ సీఈవో అదార్ పూనావాలా ఈ విషయమై నోరు మెదపొద్దన్నాడని, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎగుమతులను అనుమతించాల్సిందేనన్నారు.

150 దేశాలకు సీరం ఆధారం
సీరం ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఆధారపడి ఉన్నాయి. కీలక సమయంలో వ్యాక్సిన్ల సరఫరాను నిలిపివేసిందని ఆయా దేశాల ప్రభుత్వాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ దేశాలన్నీ ముందస్తుగానే వ్యాక్సిన్ కోసం సీరం ఇన్స్టిట్యూట్కు రూ.కోట్లలో అడ్వాన్స్ చెల్లించాయి.

బిల్‌గేట్స్ ఫౌండేషన్, డబ్ల్యూహెచ్‌వో ఇలా..
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కలిపి రూ.5000 కోట్లు ఇచ్చాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, డబ్ల్యూహెచ్వోలకు డబ్బు వెనక్కు ఇచ్చేందుకు సిద్ధ పడినట్లు సైరస్ పూనావాలా చెప్పారు. కానీ ఆ సంస్థలు తన ప్రతిపాదనను నిరాకరించాయన్నారు. త్వరలో కొవిషీల్డ్ ఎగుమతిపై కేంద్రం నిషేధం ఎత్తివేస్తుందని ఆ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- covisheld
- cyrus poonawala
- sii
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

