UPI | యూపీఐ మోసాలకు ఈజీగా చెక్.. ఈ ఐదింటిని అనుసరించండి చాలు..!
నేడు ఎంతో ప్రజాదరణ పొందిన ఆన్లైన్ పేమెంట్ పద్ధతుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఒకటి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన ఈ విధానం..
UPI | నేడు ఎంతో ప్రజాదరణ పొందిన ఆన్లైన్ పేమెంట్ పద్ధతుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఒకటి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన ఈ విధానం.. దేశంలోని చెల్లింపుల వ్యవస్థలో చాలా మార్పులనే తీసుకొచ్చింది. అయితే పెరుగుతున్న యూపీఐ మోసాలు ఇప్పుడు వినియోగదారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్నేండ్లుగా అనేక మార్గాల్లో అమాయకుల సొమ్మును స్కామర్లు, ట్రిక్స్టర్లు దోచేస్తున్నారు. దీంతో ఎన్పీసీఐ తమ కస్టమర్ల రక్షణార్థం ఐదు రకాల సేఫ్టీ టిప్స్ చెప్తున్నది. వాటిని పరిశీలిస్తే..
1. నగదు స్వీకరణకు స్కాన్ అక్కర్లేదు
చాలామంది స్కామర్లు అమాయకులను మోసం చేయడానికి.. మీకు మేము నగదు పంపాలంటే ఈ యూపీఐ కోడ్‌ను స్కాన్ చేయాలని చెప్తున్నారు. అయితే ఇది ఎంతమాత్రం నిజం కాదు. మీరు ఎవరికైనా నగదును పంపాలంటేనే క్యూఆర్ కోడ్స్ స్కానింగ్ అవసరం. అంతేగానీ మీరు ఎవరి నుంచైనా నగదును స్వీకరించడానికి స్కాన్‌తో పనిలేదు. కాబట్టి ఇకపై ఎవరైనా మీకు నగదు పంపాలంటే ఈ యూపీఐ కోడ్‌ను స్కాన్ చేయాలని చెప్తే.. దాన్ని మోసంగా గుర్తించండి.
2. చెల్లింపులకే యూపీఐ పిన్ అవసరం
మోసగాళ్లు ఈ మధ్య కాలంలో మరో ట్రిక్‌ను ప్లే చేస్తున్నారు. మీరు నగదును పొందాలంటే మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలని అంటున్నారు. ఇది కూడా నమ్మవద్దు. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఎవరికైనా యూపీఐ ఆధారిత యాప్స్ ద్వారా నగదును పంపాలంటేనే మీ సీక్రెట్ పిన్ ఎంట్రీ అవసరం. అంతేతప్ప మీరు ఎవ్వరి నుంచైనా నగదును పొందాలంటే అవసరం లేదు.
3. వివరాలు తెలుసుకున్నాకే..
ఎవరికీ యూపీఐ యాప్స్ ద్వారా గుడ్డిగా నగదును పంపించవద్దు. మీరు ఎవరికైతే నగదును పంపించాలనుకుంటున్నారో ఆ వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. అంటే వ్యక్తులకైతే ఆ మొబైల్ నెంబర్ వారిదేనా? కాదా? అన్నది చూడాలి. అలాగే మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసినప్పుడు వచ్చే పేరు వారిదా? లేదా? అన్నదీ చూడాలి. ఇక దుకాణాల్లో, షాపింగ్ మాల్స్, మరే ఇతర చోట్లనైనా క్యూఆర్ కోడ్స్‌ను స్కానింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గోడల మీద, ఇంకా ఎక్కడైనా అతికించిన కోడ్స్‌ను స్కాన్ చేసినప్పుడు అక్కడి దుకాణదారులను అడిగి వారిదేనా? అని ధ్రువీకరించుకోవాలి. లేకపోతే షాప్‌వాళ్లకు కూడా తెలియకుండా మోసగాళ్లు అంటించిన తప్పుడు క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేసి నగదును నష్టపోయే ప్రమాదం ఉన్నది.
4. అనవసరపు యాప్‌ల డౌన్లోడ్ వద్దు
సైబర్ నేరగాళ్లు.. ఏవైనా ప్రోత్సాహకాలు, ఆఫర్లు రావాలంటే యూజర్లను ఫలానా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. అయితే ఆ ప్రక్రియ పూర్తి కావాలంటే యూజర్ల యూపీఐ పిన్ నెంబర్ అవసరం. ఒకవేళ మోసగాళ్ల మాటలు నమ్మి సదరు యాప్‌ను డౌన్లోడ్ చేసి, అక్కడ అడిగిన మీ యూపీఐ పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే మీ ఖాతాలోని నగదు అంతా మాయం. అందుకే అనామక యాప్‌ల జోలికి వెళ్లవద్దు. తెలియని యాప్‌లను అస్సలు డౌన్లోడ్ చేసుకోవద్దు. మీ మొబైల్లో మీకు తెలియని, మీరు వాడని యాప్‌లు ఉన్నా డిలీట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే మీరు తెలిసో, తెలియకనో డౌన్లోడ్ చేసిన వాటివల్ల మీ రహస్య సమాచారం మీరు గుర్తించకుండానే మోసగాళ్లకు అందే ప్రమాదం ఉన్నది. ఇక మీరు ఎప్పుడూ వాడే యూపీఐ యాప్ పేజీలో తప్ప మరెక్కడా మీ పిన్ నెంబర్లను ఎంటర్ చేయవద్దు.
5. స్క్రీన్, పిన్, ఓటీపీ షేరింగ్లతో నష్టం
అపరిచితుల నుంచి ఏవైనా వస్తే వాటిని ఇతరులకు షేరింగ్ చేయడం ఆపేయండి. లింక్స్, స్క్రీన్షాట్స్కు దూరంగా ఉండాలి. కనిపించిన లింక్స్‌పై క్లిక్ చేయవద్దు. అలాగే ఎవరితోనూ మీ పిన్ నెంబర్లను షేర్ చేసుకోవద్దు. ఒకవేళ మీ స్నేహితులు, బంధువుల్లో ఎవరికైనా చెప్పాల్సి వస్తే.. ఆ తర్వాత వెంటనే పిన్ నెంబర్‌ను మార్చేయాలి. ఇక ఆర్థిక వ్యవహారాల్లో ఓటీపీలను ఎవరూ అడగరు. అడిగారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే లెక్క. కాబట్టి మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీలను ఎవ్వరికీ చెప్పవద్దు. మీ బ్యాంక్ ఖాతా నెంబర్లు, మీ మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం పిన్ నెంబర్లు, ఇతరత్రా కీలక సమాచారాన్ని మీ మొబైల్స్‌లో దాచుకోవద్దు. మీ మొబైల్ హ్యాకింగ్‌కు గురైతే ఆ విలువైన సమాచారం మోసగాళ్లకు అందుతుంది. అప్పుడు అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. ఫోన్‌ను తరచూ ఫార్మాట్ చేస్తూ ఉంటే మీకు తెలియకుండా వచ్చే మోసపూరిత యాప్స్ నుంచి తప్పించుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

