UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
UPI fee : రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై కేంద్రం ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీలు వసూలు చేయబోతున్న సంగతి తెలిసిందే.
UPI fee : రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై కేంద్రం ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీలు వసూలు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఛార్జీల అమలుపై ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కీలక ప్రకటన చేసింది. వచ్చే దివాళి తర్వాత నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూపీఐ అండ్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది.
ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. పండుగలు ముగిసిన తర్వాత.. అంటే దీపావళి అనంతరం నిర్దేశిత లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపింది. నిజానికి ఈ ఛార్జీల అమలు అక్టోబర్ 15 నుంచే అమలు కావాల్సి ఉంది. కానీ, దసరా, దీపావళి పండుగల్ని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసింది. దీపావళి, ధన్‌తేరాస్ సమయంలో భారీ స్థాయిలో కొనుగోళ్లు ఉంటాయి. దీనిలో యూపీఐ లావాదేవీలు అత్యధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఎండీఆర్ ఛార్జీలు అమలు చేస్తూ వ్యాపారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.
అలాగే, యూపీఐ పేమెంట్స్ ఎకో సిస్టం దెబ్బతినొచ్చు. కొందరు వ్యాపారులు యూపీఐని వాడకుండా నగదు పేమెంట్స్వైపు మొగ్గు చూపొచ్చు. అందుకే, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. దీపావళి వరకు ఈ నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. ఎండీఆర్ ఛార్జీలపై ప్రస్తుతం వ్యాపారులు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎండీఆర్ ఛార్జీల అమలు అక్టోబర్ 15 నుంచి వచ్చే జనవరి 1కి వాయిదా పడనుందని ప్రచారం జరిగింది. కానీ, ప్రచారాన్ని తిప్పికొడుతూ.. ఈ నిర్ణయాన్ని దీపావళి తర్వాత నుంచి అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది.
రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఛార్జీలను వ్యాపారులు.. వినియోగదారులకు బదిలీ చేయకూడదని కేంద్రం ఆదేశించింది. మొత్తం వసూలైన ఎండీఆర్ ఛార్జీల్లో 40 శాతం కస్టమర్ బ్యాంకుకు చెల్లిస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత 30 శాతం పేమెంట్ గేట్ వే ఛార్జీలు. 20 శాతం యూపీఐ సంస్థలకు, 10 శాతం ఆ డబ్బు రిసీవ్ చేసుకునే బ్యాంకుకు వెళ్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Diwali
- npci
- transactions
- UPI fee
RELATED ARTICLES
తాజా వార్తలు
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

