పీఎన్బీ కేసులో ట్విస్ట్!
- అప్రూవర్‌గా మారిన నీరవ్ సోదరి
- బ్రిటన్ నుంచి కేంద్రానికి రూ.17 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 1: నగల వ్యాపారి నీరవ్‌మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,000 కోట్లకుపైగా మోసగించిన కేసులో తాజాగా ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. నీరవ్ సోదరి పుర్వీ మోదీ అలియాస్ పుర్వీ మెహతా ఈ కేసులో అప్రూవర్‌గా మారుతూ, తన బ్రిటన్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.17.25 కోట్లు భారత ప్రభుత్వానికి బదిలీ చేసింది. బ్రిటన్ పౌరులైన పుర్వీ, ఆమె భర్త మైయాంక్ మెహతాలు ఇప్పటివరకూ ఈ కేసు దర్యాప్తులో పాలుపంచుకోలేదు. అయితే లండన్‌లో తన పేరిట ఉన్న బ్యాంకు ఖాతా గురించి ఇటీవల తెలుసుకున్నానని, అది తన సోదరుడి తరపున ప్రారంభమైనట్లు తెలిసిందని, ఆ ఖాతాలో ఉన్న డబ్బు తనదికాదని పుర్వీ జూన్ 24న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు తెలిపింది. ఆ తర్వాత కేసులో అప్రూవర్‌గా మారుతూ ఆ ఖాతా నుంచి 23,16,889 డాలర్లు భారత ప్రభుత్వపు బ్యాంకు ఖాతాకు పంపించినట్లు ఈడీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
దాంతో పీఎన్బీ ఫ్రాడ్ నేరానికి సంబంధించి రూ.17.25 కోట్లు రికవరీ చేసుకున్నట్లయ్యిందని ఈడీ పేర్కొంది. అలాగే రూ.579 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి సహకరిస్తానంటూ పుర్వీ మోదీ తెలిపినట్లు ఈడీ పేర్కొన్నది. దేశం నుంచి పరారైన నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్ జైలులో ఉండగా, ఈ కేసులో మరో నేరగాడిగా ఉన్న మెహుల్ చోక్సీని కూడా కరేబియన్ దీవుల్లో అరెస్టు చేసిన సంగతీ విదితమే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

