టయోటా అర్బన్ క్రూజర్ల రీకాల్

ఎయిర్‌బ్యాగ్ మాడ్యూల్లో లోపమే కారణం
న్యూఢిల్లీ, మార్చి 17: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా ఇండియా తన ‘అర్బన్ క్రూజర్’ కాంపాక్ట్ ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది జూలై 28 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 11 వరకు తయారైన అర్బన్ క్రూజర్లలో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ మాడ్యూళ్లు లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించడంతో దాదాపు 9,500 యూనిట్లను రీకాల్ చేస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించింది. లోపభూయిష్టంగా ఉన్న ఎయిర్‌బ్యాగ్ మాడ్యూళ్లను ఉచితంగానే మారుస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం అర్బన్ క్రూజర్ల యజమానులు సమీపంలో ఉన్న టయోటా అధీకృత డీలర్లను గానీ 1800 4250001 నంబర్‌కు ఫోన్‌చేసి టయోటా కస్టమర్ అసిస్టెన్స్ సెంటర్‌ను గానీ సంప్రదించాలని సూచించింది.
బ్రెజా సురక్షితమే
అయితే అర్బన్ క్రూజర్కు మూలాధారమైన మారుతి సుజుకీ విటారా బ్రెజా కార్లలో మాత్రం ఇలాంటి సమస్యలేవీ బయటపడకపోవడం గమనార్హం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

