Innova | బెంగళూరు, ఏప్రిల్ 17: నయా ఇన్నోవాను మార్కెట్‌కు పరిచయం చేసింది టయోటా కిర్లోస్కర్. 10కి పైగా అడ్వాన్స్ టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్‌తో రూపొందించిన ఈ కారు ప్రారంభ ధర రూ.20.99 లక్షలు. ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ఆరంభించిన ఈ సంస్థ..బుకింగ్ చేసుకున్నవారికి ఈనెల చివరి నుంచి డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏడుగురు, ఎనిమిది మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు గరిష్ఠ ధర రూ.21.13 లక్షలు. లీటర్ పెట్రోల్‌కు 16 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. 16 అంగుళాల టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, మూడేండ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వ్యారెంటీ కల్పిస్తున్నది.