వ్యాక్సినేషన్ వ్యయం రూ 3.7 లక్షల కోట్లు : ఎస్బీఐ

న్యూఢిల్లీ : భారత్ లో వ్యాక్సినేషన్ వ్యయం రూ 3.7 లక్షల కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడించింది. అత్యధిక జనాభాతో కూడిన పేద రాష్ట్రాలు తమ ప్రజలకు వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టే పరిస్థితిలో ఉండవని, ఇక సంపన్న రాష్ట్రాలు గ్లోబల్ మార్కెట్ లో అధిక ధరల్లో వ్యాక్సిన్ల కోసం వెచ్చించాల్సి వస్తుందని ఈ నివేదికలో ఎస్బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రం సమకూరుస్తుందని అంచనా వేస్తూ సిక్కిం ఒక్కో వ్యాక్సిన్ కు 5 డాలర్లు ఖర్చు చేసినా రూ 20 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని నివేదిక వివరించింది.
ఇక ఉత్తర్ ప్రదేశ్ వ్యాక్సినేషన్ పై రూ 67,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో ప్రజలకు త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్లను సమీకరించాలని నివేదిక సూచించింది. రాష్ట్రాల వ్యాక్సినేషన్ వ్యయం ఒకే విధంగా ఉండేందుకూ ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్ సరఫరాదారులతో సభ్యదేశాల తరపున సంయుక్త ప్రతినిధుల టీం సంప్రదింపులు జరిపిన ఐరోపా సమాఖ్య తరహాను కేంద్రం అనుసరించాలని ఎస్బీఐ నివేదిక స్పష్టం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

