IT Returns | ఐటీ రిటర్న్స్ టైం ఆగయా.. అందుకు ఏం చేయాలంటే?!
IT Returns | ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్స్ దాఖలు టైం వచ్చేసింది. పామ్-16, టీడీఎస్ తదితర వివరాలు చెక్ చేసుకోవాలి.
IT Returns | ఆదాయ పన్ను మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు ప్రక్రియ సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించిన ఆదాయం గల వారు రూల్స్ ప్రకారం సకాలంలో తమ నిర్ణీత ఐటీఆర్ ఫామ్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు టైం వచ్చేసింది. ఆదాయం పన్ను విభాగం వెబ్సైట్లో ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా నింపి.. తర్వాత వాటిని ఒకసారి చెక్ చేసుకుని ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసేయొచ్చు. అంతకుముందు మీరు మీ ఆదాయ వనరుల వివరాలు.. అందుకు ఆధారాలు సేకరించాలి..
ఫామ్-16 ఇలా
ప్రతి సంస్థ మేనేజ్మెంట్ తమ ఉద్యోగులకు వేర్వేరుగా ఫామ్-16 జారీ చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మీరు సంపాదించిన వేతనం.. టీడీఎస్, ఐటీ మినహాయింపులకు మీరు చేసే క్లయిమ్‌లు తదితర వివరాలన్నీ అందులో ఉంటాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ సిబ్బందికి ఫామ్-16 జారీ చేసేశాయి. మరికొన్ని సంస్థలో త్వరలో వాటిని పంపిణీ చేయడానికి సంసిద్ధం అయ్యాయి. ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ముందుగా ఫామ్-16లో ఆదాయం, ఐటీ రిటర్న్స్‌లో నింపి ఉన్న మొత్తం ఆదాం వివరాలతో సరిపోయిందా.. లేదా.. అని చెక్ చేసుకోవాలి.
టీడీఎస్‌లో ఇతర ఆదాయం డిటైల్స్
వేతనం కాకుండా ఇతర ఆదాయం సంపాదించినప్పుడు విధించే టీడీఎస్ వివరాలు తెలిపే ఫామ్ ఫామ్-16ఏ. బ్యాంకులో రూ.40 వేలు దాటిన డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ వసూలు చేస్తారు. ఇటువంటి తరుణంలో ఫామ్-16ఏ జారీ చేస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ ఖాతాదారులకు రూ.5000 కంటే ఎక్కువ డివిడెండ్ చెల్లించినప్పుడు ఈ ఫామ్ జారీ చేస్తారు.
డిపాజిట్లపై వడ్డీ ఆదాయం విడివిడిగా..
ఇక పోస్టాఫీసు, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసే మొత్తాలపై వచ్చిన వడ్డీ ఆదాయం వివరాలను ఐటీఆర్‌లో విడివిడిగా చూపాలి. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. ఆదాయం పన్ను చట్టంలోని 80టీటీఏ సెక్షన్ ప్రకారం సేవింగ్స్ అకౌంట్‌పై రూ.10 వేల వరకు వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తే.. మొత్తం ఇన్‌కంలో కలిపి చూపి, శ్లాబ్‌ల వారీగా ఐటీ పన్ను చెల్లించాలి.
ఏఐఎస్ డిటైల్స్ ఐటీ రిటర్న్స్ దాఖలులో ఇలా
ఆదాయం పన్ను విభాగం గతేడాది నవంబర్‌లో పన్ను చెల్లింపు దారుల కోసం వార్షిక ఆదాయ నివేదిక (ఏఐఎస్) అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపు దారుడి అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. ఏఐఎస్‌లో పేర్కొన్న ఆదాయం వివరాలన్నీ ఆధారాలతో సహా ఐటీ రిటర్న్స్ పత్రాల్లో ఆదాయం పన్ను విభాగానికి తప్పనిసరిగా చూపాలి. ఆదాయం పన్ను విభాగం వెబ్సైట్ నుంచి ఫామ్-26ఏఎస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం, పన్ను పేమెంట్స్ డిటైల్స్ ఉంటాయి. 26 ఏఎస్‌లోని టీడీఎస్- మీ దగ్గర గల టీడీఎస్ సర్టిఫికెట్లతో చెక్ చేసుకున్నాక ముందుకెళ్లాలి.
ఐటీ రిటర్న్స్ పాత విధానంలో ఇలా
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి పాత, కొత్త విధానాలు ఉన్నాయి. పాత విధానాన్ని ఎంపిక చేసుకున్న వారు తమ మినహాయింపు క్లెయిమ్‌ల ఆధారాలు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. యాజమాన్యానికి ముందే ఆధారాలు సబ్మిట్ చేసినా.. ఫామ్-16లో రిజిస్టరయ్యాయో లేదో మరోసారి చెక్ చేసుకోవాలి. మేనేజ్మెంట్కు అందించని పన్ను ఆదాకు పెట్టుబడులు పెట్టిన పథకాల వివరాలను ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నప్పుడు క్లయిమ్ చేసుకోవచ్చు. స్థిర ఆస్తుల విక్రయం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్ల సేల్ వంటి లావాదేవీల్లో వచ్చిన లాభాలను ఐటీ రిటర్న్స్‌లో చూపాలి. పెట్టుబడిపై రాబడి ఉన్న వారు ఐటీఆర్-1 ఫామ్‌కు బదులు ఐటీఆర్-2, ఐటీఆర్-3 ఫామ్‌ల్లో ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- it returns
- TDS
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

