నెలకు రూ.300 ప్రీమియం.. రూ.25 లక్షల రిటర్న్స్.. ఇవీ బీమా ప్లాన్స్..డిటైల్స్
నెలకు రూ.300 ప్రీమియం.. రూ.25 లక్షల రిటర్న్స్| కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్ కల్పిస్తూ ఎడెల్వైజ్ టోకియో లైఫ్ ...

న్యూఢిల్లీ: ఇప్పుడంతా కరోనా మహమ్మారి కాలం.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన.. ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఏం చేయాలి.. కుటుంబ భవితవ్యంపై యజమానికి ఎనలేని బెంగ.. విపత్కర పరిస్థితుల్లో కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం పలు జీవిత బీమా సంస్థలు రకరకాల పాలసీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్ కల్పిస్తూ ఎడెల్వైజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ సమగ్ర రక్షణ ప్రణాళికతో కూడిన పాలసీని అందుబాటులోకి తెచ్చింది. కరోనా నేపథ్యంలో తన కుటుంబ భవిష్యత్ అవసరాలకు వన్ స్టాప్ సొల్యూషన్‌గా టోటల్ ప్రొటక్షన్ ప్లాన్ ఉంటుంది.
నెలవారీ ప్రీమియం రూ.300.. ఏడాదికి మాత్రం రూ.3000
కనీస వార్షిక ప్రీమియం రూ.3000గా నిర్ణయించారు. సెమీ వార్షిక ప్లాన్‌కు కనీస ప్రీమియం రూ.2000, కనీస త్రైమాసిక ప్రీమియం రూ.1250 నుంచి మొదలవుతుంది. నెలవారీ ప్రీమియం అయితే రూ.300తో ప్రారంభం అవుతుంది. ఈ పాలసీ తీసుకునే వారి కనీస వయస్సు 18 ఏండ్లు దాటి ఉండాలి. ఇందులో సదరు వ్యక్తి పాలసీ సర్టిఫికెట్ అందుకున్న తేదీ నుంచి 15 రోజుల పాటు ఫ్రీ లుక్ పీరియడ్ కల్పించారు.
అదనపు ప్లాన్లు ఎంచుకోవచ్చు ఇలా
కస్టమర్లు అదనపు ప్లాన్లను ఎంచుకునే వెసులుబాటు కూడా ఎడెల్వైజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. అందులో ఒకటి చైల్డ్ ఫ్యూచర్ ప్రొటెక్ట్ బెనిఫిట్.. రెండవది జీవిత భాగస్వామి బెనిఫిట్. చైల్డ్ ఫ్యూచర్ ప్రొటెక్షన్ ప్లాన్ కింద కనీస మొత్తం హామీ మొత్తంలో 10 శాతం అదనంగా లభిస్తుంది. అయితే, పాలసీ ప్రారంభమయ్యే నాటికి పిల్లల వయస్సు 25 ఏండ్ల లోపే ఉండాలి.
ఇలా జీవిత భాగస్వామికి బెనిఫిట్లు
ఒకవేళ పాలసీదారు మరణిస్తే ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి బెనిఫిట్లు లభిస్తాయి. పాలసీ కల్పిస్తున్న కనీస మొత్తం హామీ లేదా రూ.50 లక్షల వరకు బెనిఫిట్లు ఉంటాయి. అయితే, భార్యాభర్తల మధ్య 10 ఏండ్ల కన్నా తక్కువ గ్యాప్ ఉండాలి. లైఫ్ కవర్, రిటర్న్ ఆఫ్ ప్రీమియం, లైవ్ లాంగ్ ఆప్షన్ల ప్రకారం పాలసీదారుకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బెనిఫిట్లు వస్తాయి.
టోటల్ ప్రొటెక్ట్ ప్లస్ కింద వివిధ ప్లాన్లు ఇవే..
- 100 ఏండ్ల వరకు లైఫ్ కవర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
- రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ మెచ్యూర్ అయ్యాక ఎవరైనా రిటర్న్స్ తీసుకోవచ్చు.
- పాలసీదారులు 60-65 ఏండ్ల వరకు లైవ్ లాంగ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. వయస్సును బట్టి ప్రీమియం ఆప్షన్ నిర్ణయించుకునే ప్రాధాన్యం పాలసీదారులదే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

