Fixed Diposits | ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ బ్యాంకు గరిష్టంగా 9 శాతం వడ్డీ.. !
Fixed Diposits | యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై తొమ్మిది శాతం వడ్డీ అందిస్తున్నది.
Fixed Diposits | గత మేలో ఆర్బీఐ రెపోరేటు పెంచినప్పటి నుంచి పలు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు గణనీయంగా పెంచాయి. ఇతర బ్యాంకులతో పోలిస్తే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ( Unity Small Finance Bank ) న్యూ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ `శాగూన్ ( Shagun)` ప్రారంభించింది. వివిధ టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీరేట్లు సవరించింది. ఈ నెలలోనే రెండుసార్లు వడ్డీరేట్లు సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీరేట్లు ఈ నెల 18 నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది.
సాధారణ ఖాతాదారులకు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.5% నుంచి 8.50% వరకు వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నది. 181 రోజుల నుంచి 501 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లకు 8.50 శాతం వడ్డీ మాత్రం లభిస్తుంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ముందస్తుగా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేటులో ఒకశాతం కోత విధిస్తారు. రూ.లక్ష దాటిన సేవింగ్స్ అకౌంట్లపై ఏడు శాతం, రూ. లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై ఆరు శాతం వడ్డీ అందిస్తుంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 999 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.01 శాతం, సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 8.26 శాతం వడ్డీ అందజేస్తుంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఏడాది నుంచి రెండేండ్ల గడువు గల (రూ.15 లక్షలు-రూ.2 కోట్ల) ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.35 శాతం అందిస్తోంది. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు రూ.15 లక్షల పై చిలుకు ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వడ్డీ ఇస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

