ఈజీగా ఐటీఆర్ ఫైలింగ్
- ఫార్మ్ 26ఏఎస్, ఏఐఎస్ గురించి తెలుసా!
ఆదాయం పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు ముంచుకొస్తున్నది.ఈ నెలాఖరే చివరి తేదీ. కాబట్టి ఇప్పటికే ఇండివిడ్యువల్స్ అంతా తమతమ రిటర్న్స్ దాఖలు కోసం తల మునకలైపోతూంటారు.
అయితే ఎలాంటి ఇబ్బందులూ, అలసత్వం, తప్పులూ లేకుండా రిటర్న్స్ ఫైల్ చేసేందుకు రెండు సులువైన మార్గాలున్నాయి. వాటినే ఇక్కడ మీరు తెలుసుకోబోతున్నారు. అవే ఫార్మ్ 26ఏఎస్, ఏఐఎస్ (వార్షిక సమాచార ప్రకటన).
ఫార్మ్ 26ఏఎస్, ఏఐఎస్ రెండూ పన్ను మదింపు దగ్గర్నుంచి ట్యాక్స్ రిటర్న్స్ దాఖలుదాకా పక్కాగా ఉండేలా ట్యాక్స్‌పేయర్లకు దోహదపడతాయి. మరో 20 రోజుల్లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి (2022-23 మదింపు సంవత్సరం)గాను ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికున్న గడువు ముగిసిపోతుంది. దీంతో ఫార్మ్ 26ఏఎస్, ఏఐఎస్‌లపై అవగాహన తప్పక లాభదాయకమే.
ఫార్మ్ 26ఏఎస్
ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ పోర్టల్‌లో లేదా బ్యాంకింగ్ వెబ్సైట్ నుంచి రీడైరెక్ట్ ద్వారా ఈ ఫార్మ్ 26ఏఎస్ చూసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా టీడీఎస్ డిడక్షన్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. గడచిన ఏడాదిలో ఎవరెవరు ఎంతెంత ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) డిడక్ట్ చేశారు.. ఎప్పుడు చెల్లించారు.. ఎంత చెల్లించారు.. అనే సమస్త సమాచారం ఇందులో పొందుపరిచి ఉంటుంది. అదే సమయంలో ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్)కు సంబంధించిన ఇన్ఫర్మేషన్తోపాటు మీరు ఏదైనా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినా ఇందులో కనిపిస్తుంది. ఇవేగాకుండా మీకు బ్యాంకుల నుంచి వడ్డీ రూపంలో ఏదైనా లభించినా కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గడచిన ఏడాదిలో మీ నుంచి డిడక్ట్ చేసిన డబ్బు ఏదైనా సరే ఇందులో కనిపిస్తుంది. ఉదాహరణకు మీ కంపెనీ కట్ చేసే టీడీఎస్, ఫిక్స్డ్ డిపాజిట్లపైన మీ బ్యాంక్ కట్‌చేసే డబ్బుసహా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే రిటర్న్స్ ఫైలింగ్‌కు దీన్నే ప్రామాణికంగా మాత్రం తీసుకోవద్దు. -నాగేంద్ర సాయి కుందవరం
ఏఐఎస్ ఫార్మ్ కీలకం
గత ఏడాది నుంచి ఈ ఫార్మ్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తోంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇది. ఫార్మ్ 26ఏఎస్ కంటే ఇందులో మరింత సమాచారం మన కోసం సిద్ధంగా ఉంటుంది. మనం గతంలో ఏవైనా బకాయిపడిన పన్నులు, అధిక విలువ కలిగిన లావాదేవీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు-అమ్మకాలు, విదేశాల నుంచి అందిన మొత్తం, ఫారిన్ కరెన్సీ కొనుగోలు, వడ్డీ ఆదాయం, డివిడెండ్సహా అన్నింటినీ క్రోడీకరించి ఇందులో మన కోసం ఐటీ శాఖ సిద్ధంగా ఉంచుతుంది. మనం ఒకవేళ ఎక్కడైనా పొరపాటున మర్చిపోవచ్చేమోగానీ.. ఇందులో మాత్రం అన్నీ కవరై ఉంటాయి. ఇవేగాకుండా రూ.10 లక్షలకు మించి జరిపిన లావాదేవీలు, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్, ఉపసంహరణ వంటివి కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉంటాయి. నిరుడు చెల్లించిన పన్నులో ఏదైనా బకాయి ఉందా, రిఫండ్ క్రెడిట్ వచ్చిందా, అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత చెల్లించారు, సేవింగ్స్ బ్యాంక్ నుంచి ఎంత వడ్డీ వచ్చింది, ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయమెంత?.. అనేవన్నీ ఇక్కడ క్లియర్‌గా ఉంటాయి. మనం ఆధార్, పాన్ లింక్ చేయడం వల్ల ఈ సమాచారం అంతా వివిధ మార్గాల నుంచి ఐటీ శాఖకు చేరుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

