హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంక్యుబేటర్లు, స్టార్టప్ ఎకో సిస్టంలోని పలు కేంద్రాలతో కలిసి ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను వృద్ధిపథం వైపు నడిపించేలా ‘మిషన్ 10ఎక్స్-ఎస్ఐజీలు’ పేరుతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.
ఇందులో భాగం గా ప్రారంభ ఆదాయ స్టార్టప్‌లను గుర్తించడం, వాటికి స్టార్టప్ ఎకో సిస్టం ద్వారా సహకారం అందించడం, మార్కెట్లోకి వెళ్లేలా ప్రోత్సహించడం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసేలా వీలు కల్పించడం, అంతేగాక అవసరమైన నిధులను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని టీఎస్ఐసీ సీఐవో శాంతా తౌటం తెలిపారు. ఇక రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, టీ-హబ్‌లతో కలిసి మెడ్‌టెక్, డీప్‌టెక్, అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం చేసేలా ‘మిషన్ 10ఎక్స్-ఎస్ఐజీ’ని ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. మరిన్ని వివరాలకు https://bit.ly/ 3pkvTJ1 సంప్రదించాలని సూచించారు.