Postal Life Insurance | పోస్టల్ జీవిత బీమా.. పీఎల్ఐ-ఆర్పీఎల్ఐకి ఉన్న ఐటీ ప్రయోజనాలేమిటి?
భారతీయ తపాలా కార్యాలయం (ఇండియా పోస్ట్ లేదా పోస్టాఫీస్) రెండు రకాల జీవిత బీమా పథకాలను అందిస్తున్నది. అవే.. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ), గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్పీఎల్ఐ). భద్రత, సుస్థిరతలకు మదుపరులు ముందుగా చూసేది పోస్టాఫీస్ స్కీములనేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Postal Life Insurance | భారతీయ తపాలా కార్యాలయం (ఇండియా పోస్ట్ లేదా పోస్టాఫీస్) రెండు రకాల జీవిత బీమా పథకాలను అందిస్తున్నది. అవే.. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ), గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్పీఎల్ఐ). భద్రత, సుస్థిరతలకు మదుపరులు ముందుగా చూసేది పోస్టాఫీస్ స్కీములనేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు, ఆయా రంగాల నిపుణులు, వ్యాపారులు, ఇతరత్రా వృత్తులవారికి అనేక ప్రయోజనాలను చేకూర్చే ఈ స్కీముల్లో బీమా పథకాలకు సైతం గొప్ప ఆదరణే ఉంటున్నది. వాటికి ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపులు కూడా ఉన్నాయి.
పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ ప్రీమియం చెల్లింపుల్లో పోస్టాఫీస్ రిబేట్‌ను ఆఫర్ చేస్తున్నది. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద పీఎల్ఐ స్కీంలో 6, 12 నెలలు లేదా ఆపై ముందస్తు పేమెంట్లకు 1 శాతం నుంచి 2 శాతం రిబేట్ వస్తున్నది. అలాగే ఆర్పీఎల్ఐ స్కీంలో 3, 6, 12 నెలలు లేదా ఆపై ముందస్తు చెల్లింపులకు 0.5 శాతం, 1 శాతం, 2 శాతం రిబేట్లు వర్తిస్తున్నాయి.
- పోస్టాఫీసుల్లో లేదా పోస్టల్ ఏజెంట్లను సంప్రదించి ఈ బీమా పాలసీలను తీసుకోవచ్చు.
- పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ పాలసీదారులు తమ ప్రీమియంలను దేశవ్యాప్తంగా ఉన్న ఏ పోస్టాఫీస్‌లోనైనా చెల్లించవచ్చు. పీఎల్ఐ పోర్టల్ ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా, భీమ్/యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఉద్యోగులు తమ సాలరీ అకౌంట్ల నుంచి ఆటోమేటిక్ డెబిట్ కూడా చేయించుకోవచ్చు.
- ఈ పోస్టల్ బీమా పథకాలకు 19-55 ఏండ్లవారు అర్హులు.
- పాలసీ కోసం ఫొటోలు, ప్రపోజల్ ఫామ్, వయస్సు-చిరునామా ధ్రువీకరణ పత్రాలు, ఐడెంటిటీ ప్రూఫ్, అనారోగ్యం ఉంటే వాటి మెడికల్ రిపోర్టులు అవసరం.
- సమ్ అష్యూర్డ్ పరిమితి కనిష్ఠంగా రూ.10,000, గరిష్ఠంగా రూ.10 లక్షలు.
- పాలసీ తీసుకున్న 3 ఏండ్ల తర్వాత నుంచి రుణాలు, సరెండర్ సదుపాయం ఉంటుంది.
- పీఎల్ఐలో సుమంగళ్, బాల జీవన్ బీమాలపై రుణ సౌకర్యం, సరెండర్ అవకాశం లేదు.
- గ్రామీణ పీఎల్ఐలో గ్రామ ప్రియ, గ్రామ సుమంగళ్, బాల జీవన్ బీమాలపై రుణ సౌకర్యం, సరెండర్ అవకాశం ఉండదు.
- బాల జీవన్ బీమా పథకానికి 5-20 ఏండ్లవారు అర్హులు. తల్లిదండ్రుల వయసు 18-45 ఏండ్ల మధ్య ఉండాలి. కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరి పిల్లలకే పథకం వర్తిస్తుంది. గరిష్ఠ సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షలు.
పీఎల్ఐ పథకాలు
- హోల్ లైఫ్ అష్యూరెన్స్ (సురక్ష)
- కన్వర్టబుల్ హోల్ లైఫ్ అష్యూరెన్స్ (సువిధ)
- ఎండోమెంట్ అష్యూరెన్స్ (సంతోష్)
- జాయింట్ లైఫ్ అష్యూరెన్స్ (యుగళ్ సురక్ష)
- యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ (సుమంగళ్)
- చిల్డ్రెన్ పాలసీ (బాల జీవన్ బీమా)
ఆర్పీఎల్ఐ పథకాలు
- హోల్ లైఫ్ అష్యూరెన్స్ (గ్రామ సురక్ష)
- కన్వర్టబుల్ హోల్ లైఫ్ అష్యూరెన్స్ (గ్రామ సువిధ)
- ఎండోమెంట్ అష్యూరెన్స్ (గ్రామ సంతోష్)
- పదేండ్ల గ్రామీణ పీఎల్ఐ (గ్రామ ప్రియ)
- యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ (గ్రామ సుమంగళ్)
- చిల్డ్రెన్ పాలసీ (బాల జీవన్ బీమా)
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

