పెట్రోల్ మంటలు.. డ్యూటీల్లో కేంద్ర ఖజానాకు ఎంత చేరిందంటే..!
పెట్రోల్ మంటలు.. డ్యూటీల్లో కేంద్ర ఖజానాకు ఎంత చేరిందంటే..! గతేడాది సుంకాల పెంపుతో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిపై ఖజానాకు రూ.4.51 లక్షల కోట్లు ...

న్యూఢిల్లీ: విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి గతేడాది ఇతర దేశాలతోపాటు మనదేశం లాక్డౌన్ విధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గింది.. తదనుగుణంగా ఉత్పత్తి తగ్గడంతో ధర పడిపోయింది.
కానీ కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు పెంచేసింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు ఎంత జమ అయ్యిందో తెలుసా.. అక్షరాల రూ.4.51 లక్షల కోట్లు. 2019-20తో పోలిస్తే 56.5 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.
పరోక్షంగా వచ్చిన పన్నులు 56.5 శాతం పెరిగి రూ.4.51 లక్షల కోట్లకు చేరాయని ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం ఇచ్చిన సమాధానం ఇది.
మొత్తం రూ.4.51 లక్షల కోట్లలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతితో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.4.13 లక్షలు, కస్టమ్స్ డ్యూటీ రూ.37,806.96 కోట్లు
మధ్యప్రదేశ్‌లోని నీమూచ్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే ఆర్టీఐ కార్యకర్త పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిపై వచ్చిన ఎక్సైజ్, కస్టమ్స్ సుంకం వివరాలు వల్లడించాలని కోరారు.
2019-20లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిపై కస్టమ్స్ సుంకం రూ.46 వేల కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.2.42 లక్షల కోట్లు. మొత్తం రూ.2.88 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది.
ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నదని జయంతిలాల్ భండారీ అనే ఆర్థిక వేత్త చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సగటు పౌరుడిపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

