హైదరాబాద్‌లో టెస్లా సెంటర్
అమెరికాకు చెందిన ఈవీల తయారీ దిగ్గజం టెస్లా..రాష్ట్ర మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలో తన ఐదో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ రెండు మాడళ్లను ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించినట్టు, తద్వారా మరింత మంది కస్టమర్లకు చేరువకావడానికి వీలుపడనున్నదని కంపెనీ వెల్లడించింది.
హైదరాబాద్, జూన్ 17: అమెరికాకు చెందిన ఈవీల తయారీ దిగ్గజం టెస్లా..రాష్ట్ర మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలో తన ఐదో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ రెండు మాడళ్లను ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించినట్టు, తద్వారా మరింత మంది కస్టమర్లకు చేరువకావడానికి వీలుపడనున్నదని కంపెనీ వెల్లడించింది.
మాడల్ వై: దేశీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని టెస్లా మాడల్ వై రూపొందించింది. సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ కారు ధరను రూ.50.89 లక్షలుగా నిర్ణయించింది. రూ.6 లక్షలు డౌన్‌పేమెంట్ చేసి రూ.39,990 నెలవారీ చెల్లింపులతో ఈ కారును కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వచ్చే నెల నుంచి డెలివరీ చేయబోతున్నది. కేవలం 5.9 సెకండ్లలో 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకోనున్నది.
మాడల్ వైఎల్: కుటుంబం మొత్తానికి సరిపడే విధంగా డిజైన్ చేసిన మాడల్ వైఎల్లో ఆరుగురు కూర్చోవడానికి వీలుంటుంది. 5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 681 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ కారు ప్రారంభ ధర రూ.61.99 లక్షలుగా నిర్ణయించింది. రూ.6.50 లక్షలు డౌన్‌పేమెంట్ చేసి, రూ.49,990 నెలవారీ చెల్లింపులతో కొనుగోలు చేసే అవకాశం సంస్థ కల్పించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

